calender_icon.png 20 January, 2026 | 4:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్‌కు యూఏఈ అధ్యక్షుడు బిన్ జాయెద్

20-01-2026 01:46:10 AM

ఘనస్వాగతం పలికిన ప్రధాని మోదీ

ఒకే కారులో ఇరు దేశాధినేతల సవారీ

న్యూఢిల్లీ, జనవరి 19: భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక ఆహ్వానం మేరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సోమవారం ఢిల్లీకి విచ్చేశారు. విమానాశ్రయానికి స్వయంగా మోదీ వెళ్లి ఆయనకు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి ప్రధాని నివాసం వరకు వీరిద్దరూ ఒకే కారులో ప్రయాణించారు. ఈ పర్యటన గురించి మోదీ సామాజిక మాధ్యమాల్లో స్పందిస్తూ, తన సోదరుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఇండియాకు విచ్చేయడం ఆనందాన్నిచ్చిందని కొనియాడారు. ఆయన పర్యటన భారత్ మైత్రి బంధానికి ప్రతీకకా నిలుస్తుందని అభివర్ణించారు. అనంతరం ఇద్దరు దేశాధినేతలు రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. మధ్యప్రాచ్యంలో ప్రస్తుతం ఉద్రిక్తలు నెలకొన్న వేళ వీరిద్దరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకున్నది.