calender_icon.png 20 January, 2026 | 3:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్పెయిన్‌లో పట్టాలు తప్పిన ట్రెయిన్

20-01-2026 01:53:23 AM

ఎదురుగా మరో ట్రాక్‌పై వస్తున్న రైలును ఢీ

ప్రమాదంలో 39 మంది ప్రయాణికులు మృతి

వంద మందికి పైగా గాయాలు

మాడ్రిడ్, జనవరి 19: స్పెయిన్‌లో ఆదివారం రాత్రి ఘోర రైలు ప్రమాదం సంభ వించింది. వేగంగా వెళ్తున్న హైస్పీడ్ రైలు పట్టాలు తప్పి మరో ట్రాక్‌పై వెళ్లి ఎదురుగా వస్తున్న రైలును ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రగాయాల పాలై 39 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా, మరో వంద మంది వరకు క్షతగాత్రులయ్యారు. లగా  వెళ్తున్న రైలు అడముజ్ వద్ద మరో రైలును ఢీకొట్టింది. ఆ ధాటికి రెండు రైళ్ల బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రయాణికుల హాహాకారాలతో ఆ ప్రాంతం మార్మోగింది.

సమాచారం అందుకున్న స హాయక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు. బోగీ ల్లో ఇరుక్కుపోయిన వారిని ఆర్మీ సాయంతో సురక్షి తంగా బయటకు తీసుకొచ్చారు. ప్రమాదంపై స్పెయిన్ ప్రధాని పెడ్రోసాంచెజ్ స్పం దిస్తూ.. బాధితులకు న్యాయం చేస్తామని, క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అంద జేస్తామని హామీ ఇచ్చారు.