14 August, 2026 | 2:12 AM

ఏసీబీ వలలో ఆర్‌ఐ

14-08-2026 12:55 AM

బీర్పూర్ అధికారిని పట్టుకున్న అధికారులు

కోరుట్ల/జగిత్యాల, ఆగస్టు 13 (విజయక్రాంతి): జగిత్యాలలో మరో అవినీతి అధికారి ఏసీబీ వలకు చిక్కాడు. ఓ బాధితురాలు పనినిమిత్తం బీర్పూర్  రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ (ఆర్‌ఐ) రాహుల్‌ను సంప్రదించారు. దీంతో అ తను రూ. 30వేలు లంచం డిమాండ్ చేశాడు. బాధితురాలు ఏసీబీని ఆశ్రయించింది. అప్రమత్తమైన అధికారులు రాహుల్ లంచం తీసుకుంటుండగా దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని అతని వద్ద ఉన్న నగదును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ మహేందర్‌రెడ్డి తెలిపారు. బీర్పూర్ రెవెన్యూ ఆఫీస్‌లో  అధికారులు సో దాలు నిర్వహిచి పలు ఫైళ్లను సీజ్ చేశారు.