14 August, 2026 | 5:21 AM

నిందితునికి ఎస్సై సహకారం

14-08-2026 12:51 AM

రైతును ట్రాక్టర్‌తో ఢీకొట్టిన ఘటనలో చర్యలు ఏవీ?

నోటీసులు ఇవ్వకుండా ఇచ్చామని చెప్పిన ఎస్‌ఐ

దాడి చేసి తొమ్మిది రోజులైనా నిందితుడిపై చర్యలు శూన్యం 

దౌల్తాబాద్ ఎస్‌ఐ తీరుపట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బాధితులు

గజ్వేల్, ఆగస్టు 13: వ్యవసాయ పనులు చేసుకుంటున్న రైతును ట్రాక్టర్తో ఢీకొట్టిన ఘటనలో కేసు నమోదై తొమ్మిది రోజులు గడిచినా నిందితుడిపై చర్యలు తీసుకోకుండా నిందితునికి పోలీసులు అండగా నిలుస్తున్నారు. దౌల్తాబాద్ మండలం ఇందుప్రియల్ గ్రామానికి చెందిన తుప్పతి అనిల్కుమార్, అతని కుటుంబ సభ్యులు తమ ఫిర్యాదుకు పోలీసుల స్పందించడం లేదని గురువారం విజయక్రాంతితో తమ ఆవేదన వ్యక్తం చేశారు.

ఆగస్టు 5వ తేదీ  బుధవారం ఉదయం 10.30 గంటలకు తమ కుటుంబానికి చెందిన రెండెకరాల పొలంలో కూలీలతో కలిసి పత్తి పంటలో కలుపు తీస్తుండగా, పక్క పొలం యజమాని తుప్పతి శ్రీను ట్రాక్టర్తో వచ్చి గొడవపడి తనను ఢీకొట్టాడని, ఈ ఘటనలో అనిల్కుమార్కు అంతర్గతంగా బలమైన దెబ్బలు తాకడంతో  మంచానికే పరిమితమైనట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

ఘటనపై దౌల్తాబాద్ పోలీస్స్టేషన్లో ఎస్త్స్ర అరుణ్కుమార్కు ఫిర్యాదు చేయగా, పోలీసులు గ్రామానికి వచ్చి విచారణ చేపట్టారని తెలిపారు. అయితే కేసు నమోదై తొమ్మిది రోజులు గడిచినా నిందితుడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధిత కుటుంబం ఆరోపించింది. శ్రీను కుటుంబ సభ్యుల నుంచి తమకు ప్రాణహాని ఉందని, పంట సాగు చేసుకోవడానికి సైతం ఇబ్బందులు ఎదురవుతున్నాయని, తమకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరామని, అయినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితుడు అనిల్కుమార్ తెలిపారు.

ట్రాక్టర్ సీజ్ చేశాం

ఈ విషయంపై దౌల్తాబాద్ ఎస్త్స్ర అరుణ్కుమార్ను వివరణ కోరగా.. అని ల్కుమార్ను ట్రాక్టర్తో ఢీకొట్టిన తుప్పతి శ్రీనుపై కేసు నమోదు చేసి నోటీసులు ఇచ్చామని తెలిపారు. ట్రాక్టర్ను సీజ్ చేశామని, కోర్టుకు అప్పగించనున్నట్లు వెల్లడించారు. అయితే గురువారం మధ్యాహ్నం వరకూ ట్రాక్టర్ నిందితుడి వ్యవసాయ భూమిలోనే ఉన్నట్లు బాధితులు తెలిపారు.

-అరుణ్ కుమార్, ఎస్‌ఐ, దౌల్తాబాద్