18-10-2025 06:18:25 PM
పినపాక (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెనపాక మండలం జానంపేట పంచాయతీ కొత్త గుంపు గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన పానుగంటి నర్సిరెడ్డి కుటుంబాన్ని శనివారం రోజున స్థానిక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు జానంపేట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దశదినకర్మలకు బియ్యం వితరణగా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నర్సిరెడ్డి కుమారుడైనటువంటి పిచ్చిరెడ్డిని పరామర్శించి పార్టీ అన్ని విధాలు అండగా ఉంటుందని అధైర్యపడవద్దు అని చెప్పారు. ఈ కార్యక్రమంలో పేరం వెంకటేశ్వర్లు, దాట్ల రాజేష్, సాయి సురేష్, పోలిశెట్టి హరీష్, సుతారపు వీరన్న, జరుపుల రాము, పొనుగోడు చందర్ రావు, పడాల రాము, అత్తి లక్ష్మీనారాయణ, బిక్కం నరసింహారావు, కబ్బాకు రమేష్, సింహాద్రి మనోజ్, దగ్గర నరేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.