18-10-2025 06:20:02 PM
కరీంనగర్ (విజయక్రాంతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోరుతూ తెలంగాణ బంద్ లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కరీంనగర్ బస్టాండ్ వద్ద తెలిపిన నిరసన కార్యక్రమంలో వామపక్ష పార్టీలు, బీసీ సంఘాల నాయకులతో కలిసి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి జోజి రెడ్డి ఆర్టీసీ బస్సులు బయటకు రాకుండా డిపోల ముందు బైఠాయింపు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు బిల్లు ఆమోదించేలా కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని అన్నారు.కేంద్ర క్యాబినెట్లో బీసీ బిల్లుకు చట్టబద్ధత కల్పించి వెంటనే తెలంగాణలో స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కరీంనగర్ నగర అధ్యక్షుడు సత్య రావు, శ్రీనివాస్, ప్రసాద్, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.