సీబీఎస్‌ఈ క్లస్టర్ టీటీ విజేత రిద్ధి
హైదరాబాద్, ఆగస్టు 11: సిబిఎస్‌ఇ క్లస్టర్ VII అండర్-14 బాలికల సింగిల్స్ టైటిల్‌ను తెలంగాణకు చెందిన రిద్ధి టోరో కైవసం చేసుకుంది.ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు సర్ సిఆర్ రెడ్డి పబ్లిక్ స్కూల్లో ఈ పోటీలు జరిగాయి.సెమీఫైనల్లో రిద్ధి 3-1 తేడాతో ఒలివ్ మౌంట్ గ్లోబల్ స్కూల్ కు చెందిన మోక్షికా పోగాకుపై గెలిచింది. టైమ్ స్కూల్ కు చెందిన ఆమె ఫైనల్లోనూ తన అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తూ, విపిఎస్ పబ్లిక్ స్కూల్ కు చెందిన హెత్వికా కొల్లిని 3-1 సెట్ల తేడాతో ఓడించి టోర్నమెంట్ ఛాంపియన్ గా అవతరించింది.
కాగా అండర్-14 బాలికల జట్టు ఛాంపియన్ షిప్‌లో టైమ్ స్కూల్ రన్నరప్ గా నిలిచింది. రిద్ధి టోరో, వంశికా, అనన్య నేనావత్ లతో కూడిన బృందం టోర్నమెంట్ అంతటా అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. తూర్పు గోదావరి జిల్లా శ్రీ ప్రకాష్ సినర్జీ స్కూల్ మొదటి స్థానంలోనూ, మెదక్ బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్, విజయవాడ విపిఎస్ పబ్లిక్ స్కూల్ సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాయి.






