12 August, 2026 | 2:49 AM

స్పిన్నర్లే విన్నర్లు

12-08-2026 12:00 AM

స్పిన్‌కు అనుకూలించే లంక పిచ్‌లు 

ఇరు జట్లలోనూ అత్యుత్తమ స్పిన్నర్లు

జడేజా, కుల్దీప్ పైనే భారత్ ఆశలు

మానవ్ సుతార్‌కు ఛాన్స్ ఉందా ?

భారత్ , శ్రీలంక టెస్ట్ సిరీస్ మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ సిరీస్ భారత జట్టుకు కీలకంగా మారింది. వరల్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ రేసులో నిలవాలంటే ఈ సిరీస్ 2-0 తో గెలవాలి. అయితే శ్రీలంక పిచ్‌లపై మన బ్యాటర్లకు అంత ఈజీ కాదు. అలాగే ఈ పిచ్‌లు పూర్తిగా స్పిన్‌కి అనుకూలం కావడంతో స్పిన్నర్లే విన్నర్లు కానున్నారు.

కొలంబో, ఆగస్టు 11 : ఉపఖండంలో టెస్ట్ సిరీస్ లు అనగానే స్పిన్ పిచ్ లే కనిపిస్తుంటాయి. శ్రీలంక పిచ్ ల గురించి అయితే ఇక ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అక్కడ విదేశీ బ్యాటర్లు స్పిన్ ను బాగా ఆడితేనే పై చేయి సాధిస్తారు. అదే సమయంలో అత్యుత్తమ స్పిన్నర్లు ఏ జట్టులో ఉంటే ఆ జట్టుకు విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. 

శ్రీలంక పిచ్లు సాధారణంగా స్పిన్ బౌలింగ్కు ఎంతో అనుకూలంగా ఉంటాయి. ఇక్కడ మ్యాచ్లు జరిగే కొద్దీ ప్పి పగుళ్లు ఏర్పడి, బంతి బాగా టర్న్ అవుతుంది. అందువల్ల శ్రీలంక పిచ్లపై స్పిన్నర్లు మ్యాచ్ విన్నర్లుగా మారుతుంటారు. ముఖ్యంగా గాలే, కొలంబో వంటి మైదానా లు వేగంగా డ్రై అవుతాయి. దీనివల్ల మ్యాచ్ చివరి రోజుల్లో బంతి ఊహించని విధంగా టర్న్ అవుతుంది.ముత్తయ్య మురళీధరన్, రంగన హెరాత్ వంటి దిగ్గజ స్పిన్నర్లు శ్రీలంక పిచ్లపై లెక్కలేనన్ని మ్యాచ్లు గెలిపించారు.

హసరంగా, మహీష్ తీక్షణ, జెఫ్రీ వాండర్సే, ప్రభా జయసూర్య వంటి స్పిన్నర్లు స్వదేశీ పరిస్థితులను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ ప్రత్యర్థులను దెబ్బతీస్తున్నారు. మరోవైపు భారత జట్టులో రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ , మానవ్ సుతార్ కీలకం కానున్నారు.

ముఖ్యంగా జడేజాపై భారీ అంచనాలున్నాయి. టర్నింగ్ ట్రాక్లపై అతని అపారమైన అనుభవం, వికెట్లు తీసే నైపుణ్యం, భారత్కు విజయావకాశాలను నిర్ణయించడంలో కీలకపాత్ర పోషిస్తుంది.ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయడంలో జడేజా అటాక్ చాలా ముఖ్యం. శ్రీలంకపై ఇప్పటివరకు 7 టెస్టుల్లో 33 వికెట్లు పడగొట్టిన అద్భుతమైన రికార్డు జడేజా సొంతం. పిచ్లను అంచనా వేయడంలో, క్లిష్ట పరిస్థితుల్లో కొత్త స్పిన్నర్లకు సలహాలిస్తూ జడేజా తన అనుభవాన్ని పంచగలడు.

చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ప్పి పెద్దగా టర్న్ లభించే  ప్రదేశాల్లోనూ వైవిధ్యం చూపించగల, వికెట్లు తీయగల ప్రత్యేక నైపుణ్యం అతని సొంతం. సాధారణ లెగ్ స్పిన్నర్లు, ఆర్థోడాక్స్ స్పిన్నర్ల కంటే భిన్నంగా కుల్దీప్ విసిరే డెలివరీలు లంక బ్యాటర్లను గందరగోళానికి గురిచేస్తాయి.

శ్రీలాంక గడ్డపై గతంలో పల్లెకెలె వేదికగా మంచి ప్రదర్శన చేసిన అనుభవం అతనికి ఉంది. ఇటీవల వార్మప్ మ్యాచ్లలో చక్కటి లయ కనబరిచా డు. ఇదిలా ఉంటే మరో యువ స్పిన్నర్ మానవ్ సుతార్ కూడా ఈ సిరీస్ లో కీలకంగా చెప్పొచ్చు. సుతార్కు బంతిని గాలిలో టర్న్ చేయడంతో పాటు, ప్పి మంచి నియంత్రణ ఉంది.గతంలో శ్రీలంక ఎ జట్టుతో జరిగిన మ్యాచ్లలోనూ, ఎమర్జింగ్ ఆసియా కప్‌లోనూ అతను లంక పిచ్లపై సత్తా చాటాడు.