6 June, 2026 | 9:28 PM

Breaking News

విద్యా హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి: పోగుల సైదులు గౌడ్

06-06-2026 08:29 PM

మిర్యాలగూడ,(విజయక్రాంతి): విద్యాహక్కు చట్టం 2009ని పకడ్బందీగా అమలు చేసి ఫీజుల నియంత్రణలో భాగంగా ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా నల్లగొండ అధ్యక్షులు పోగుల సైదులుగౌడ్ అన్నారు. శనివారం స్థానికంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్నందున పుట్టగొడుగుల పుట్టకొస్తున్న  ప్రైవేటు విద్యాసంస్థల్లో ప్రభుత్వ ఫీజుల నియంత్రణ సిఫారసులను ఉల్లంఘించి ఆయా పాఠశాలలో కనీస మౌలిక వసతులు కల్పించకుండా డొనేషన్లు, పుస్తకాల విక్రయాలు, ఏకరూప దుస్తులు అంటూ  అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు విద్యాసంస్థలపై విద్యాధికారులు నిఘా పెట్టి ఫీజులు నియంత్రణ చేపట్టాలన్నారు. విద్యార్థులకు అవసరమైన కనీస మౌలిక వసతులు కల్పించకుండా ఒకే అనుమతితో బ్రాంచీలను ఏర్పాటు చేస్తూ నిర్వహిస్తున్న విద్యాసంస్థలపై తగు చర్యలు తీసుకొని అవసరమైతే పాఠశాల గుర్తింపును రద్దు చేయాలన్నారు. విద్యార్థుల ప్రయోజనార్థం ఫీజుల పేరుతో చదువులు దూరం చేస్తున్న ప్రైవేటు పాఠశాలల దోపిడీపై తమ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తుందన్నారు.