లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వాక్ బోర్డు అధికారి
సీఈఓకి రివేదిక ఇచ్చేందుకు లంచం డిమాండ్
నల్గొండ క్రైమ్: 10 వేల లంచం తీసుకుంటూ వక్ బోర్డు ఇన్స్పెక్టర్ ఏసీబీకి చిక్కాడు నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలోని 900 గజాల స్థలంలో మసీదు ఖాళీ స్థలం వివాదం విషయమై సర్వే చేసి పక్ బోర్డు కు నివేదిక ఇచ్చేందుకు 10వేలు లంచం డిమాండ్ చేయడంతో మసీద్ అధ్యక్షుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఏసీబీ అధికారులు ప్లాన్ ప్రకారం మిర్యాలగూడ బస్టాండ్ లో శనివారం వక్ బోర్డ్ ఇన్స్పెక్టర్ మహమూద్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు. దాతలు ఇచ్చిన మసీదు భూమి సర్వే రిపోర్టు పంపేందుకు వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ మహమూద్ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు అధికారులు నిర్ధారించారు.
మసీదు, ఖాళీ స్థలం వివాదంపై 2025 ఫిబ్రవరిలో వక్ఫ్ బోర్డు సీఈవోకు మసీద్ అధ్యక్షులు వినతి పత్రం అందజేశారు.దీంతో నివేదిక పంపాలని వక్ బోర్డు ఇన్స్పెక్టర్ నిసీఈఓ ఆదేశించారు. సర్వే పూర్తి చేసినప్పటికీ రిపోర్టును సీఈఓ కు పంపకుండా ఇన్స్పెక్టర్ మహమూ ద్ కాలయాపన చేస్తున్నాడు. రిపోర్టు పంపాలంటే రూ.10 వేల లంచం ఇవ్వాలని బాధితుడిని డిమాండ్ చేసాడు. రెడ్ హ్యాండ్ గా ఏసి బాధితులకు దొరకడంతో మిర్యాలగూడలోని ఆయన నివాసంలో, నివేదికకు సంబంధించిన ఫైలను నల్గొండ కార్యాలయంలో తనిఖీలు చేశారు.
ఆదాయానికి మించిన ఆస్తులు ఏమైనా ఉన్నాయా అనే విషయమై దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ డిఎస్పి జగదీష్ చందర్ తెలిపారు. హైదరాబాద్ నాంపల్లి కోర్టు కు రిమాండ్ తరలిస్తున్నట్లు అయన తెలిపారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా చేయాల్సిన పని చట్టబద్ధంగా చేయకుండా లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయాలని,ట్విట్టర్, ఫేస్బుక్టో,ల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయొచ్చు అని తెలిపారు.
ఉలిక్కిపడ్డ అవినీతి అధికారులు
అన్ని శాఖలకు ఏసీబీకి చిక్కిన విషయం తెలియగానే అవినీతి అధికారుల గుండెల్లో రైలు పరిగెత్తింది ప్రధానంగా పోలీస్ శాఖలో ఏసీబీకి చిక్కిన విషయమై హార్ట్ టాపిక్ గా మారింది ఆ శాఖలో కొంతమంది అధికారుల గురించి చర్చించుకున్నట్లు సమాచారం అవినీతి సొమ్ముతో ఇళ్ల స్థలాలు వ్యవసాయ క్షేత్రాలు కొన్న అధికారుల పైన చర్చించుకున్నారు






