25-01-2026 05:33:56 PM
హైదరాబాద్: మార్చిలో జీతాలు ఇచ్చేందుకు సింగరేణి వద్ద డబ్బులు లేవని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఇప్పటికే నష్టాల్లో ఉన్న సంస్థను మరింత నష్టాల్లోకి నెడుతున్నారని, బీఆర్ఎస్ హయంలో 25 టెండర్లు ఎక్సెస్ పోయాయని తెలిపారు. చిన్న చేపను పట్టి తిమింగలాన్ని వదిలేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సైట్ విజిట్ అనే కొత్త విధానం తీసుకొచ్చిందని ఆమె చెప్పారు. టెండర్ నిబంధనల్లో సైట్ విజిట్ ను రద్దు చేయాలని కవిత డిమాండ్ చేశారు.
మేఘా కృష్ణారెడ్డి అనే తిమింగలాన్ని రక్షించేందుకు బీఆర్ఎస్ చిన్న చేప చుట్టూ టెండర్ల వ్యవహారాన్ని తిప్పుతోందని ఆరోపించారు. సింగరేణి కాంట్రాక్ట్ ల విషయంలో సృజన్ రెడ్డి చిన్న చేప అని, మేఘా కృష్ణారెడ్డికి రూ.25 వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చే ప్రయత్నం జరుగుతోందని కవిత చెప్పారు.