13 July, 2026 | 9:37 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో రిమ్ జిమ్

05-01-2026 12:00 AM

1990ల కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకున్న సంఘటనల ఆధారంగా హేమ సుందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రిమ్జిమ్’. ‘అస్లీదమ్’ అనేది ఈ సినిమా ట్యాగ్లైన్. ఏవీ సినిమాస్, సీ విజువల్స్ బ్యానర్లపై జీ సచేతన్ రెడ్డి, డాక్టర్ మానస, శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్నేహం, ప్రేమ కథగా రూపొందిన ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దర్శకుడు హేమ సుందర్ మాట్లాడుతూ.. ‘సినిమా అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నాం.

ప్రేక్షకులందరికీ నచ్చేలా సినిమాను తీర్చిదిద్దాం‘ అని చెప్పారు. హేమ సుందర్ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆస్కార్ అవార్డు విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ కీలక పాత్రలో నటించగా, ఆయన పాడిన రెండు పాటలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రధాన పాత్రలో అజయ్ వేద్, హీరోయిన్గా వ్రజన నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో బిత్తిరి సత్తి, రాజ్ తిరందాస్ కనిపించనున్నారు. సంగీతం కొక్కిలగడ్డ ఇఫ్రాయిం, సినిమాటోగ్రఫీ వాసు పెండం, ఎడిటింగ్ పెనుమత్స రోహిత్ నిర్వహిస్తున్నారు. రియలిస్టిక్ టోన్, భావోద్వేగాల మేళవింపుతో రూపొందుతున్న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు త్వరలో రానుంది.