05-01-2026 12:00:00 AM
హైదరాబాద్‌లో ఫిలిం స్టార్ అల్లు అర్జున్, స్నేహారెడ్డి దంపతులకు చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం సాయంత్రం వారిద్దరూ ఓ వ్యక్తిగత కార్యక్రమానికి హాజరు కాగా, వేదిక బయట వీరిని పెద్దసంఖ్యలో అభిమానులు చుట్టుము ట్టారు. వారంతా ఒక్కసారిగా స్నేహారెడ్డి మీదకు దూసుకువస్తుండగా.. అలు అర్జున్ అప్రమత్తమయ్యారు. తన సతీమణి మీదకు జనం రాకుండా అడ్డుకున్నారు. సెక్యురిటీ సిబ్బంది వెంటనే అప్రమత్తమై దంపతులకు రక్షణ కల్పించారు. అల్లు అర్జున్ అనంతరం స్వయంగా తన భార్య చేయిపట్టుకుని కారు వరకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ ఎదురుగా వచ్చిన అభిమానులపై కాస్త అసహనానికి గురయ్యారు.
భార్యను సురక్షితంగా కారులో కూర్చోబెట్టిన తర్వాతే అల్లు అర్జున్ ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత కారు ఎక్కే ముందు అభిమానుల వైపు తిరిగి నమస్కరిస్తూ అభివాదం చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సెలబ్రిటీలు బహిరంగ ప్రదేశాలకు వచ్చినప్పుడు భద్రతా ఏర్పాట్లు సరిగా ఉండటం లేదని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఇటీవల ఒక మాల్ ఓపెనింగ్ వేడుకకు వెళ్లిన నటి నిధి అగర్వాల్ కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఆ సమయంలో నిధి తీవ్ర అసౌకర్యానికి లోనయ్యారు. అలాగే నటి సమంతకు కూడా గతంలో ఇలాంటి పరిస్థితే ఎదురైంది.