05-01-2026 12:00:00 AM
సన్నీలియోన్.. పరిచయం అవసరం లేదు. శృంగార తారగా పేరున్న ఈ భామకు ప్రపంచవ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఉంది. బాలీవుడ్ సహా దక్షిణాది చిత్రసీమకు కూడా సుపరిచితమైన పేరు సన్నీలియోన్. ఎన్నో బాలీవుడ్ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో మంచు మనోజ్ ‘కరెంట్ తీగ’ చిత్రంలోనూ తనదైన నటన, అందంతో మైమరిపించింది. ఇటీవల సన్నీ సందడి సినిమాల్లో అంతంత మాత్రంగానే ఉంది. అయితే, సన్నీ ఇటీవల సోషల్ మీడియా వేదికల ద్వారా తన అభిమానులకు నిరంతరం టచ్‌లో ఉంటోంది. తాజాగా సన్నీ పంచుకున్న యూనిక్ ఫోటోషూట్ ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారుతోంది. ఈ క్రమంలో సన్నీ సినిమా ముచ్చట్లు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.
సన్నీ ఇటీవలే దక్షిణాదిన ఓ ద్విభాషా చిత్రంలో నటించింది. డబ్ల్యూఎం మూవీస్ సంస్థలో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసినట్లు సన్నీలియోన్ స్వయంగా ప్రకటించింది. తన చివరి షెడ్యూలును పూర్తి చేసుకున్న తర్వాత నటీనటులు, సిబ్బంది సెట్లో కేక్ కటింగ్ వేడుకలో పాల్గొన్న ఫోటోలను షేర్ చేసింది. తమిళం, తెలుగు.. రెండు భాషల్లో చిత్రీకరించిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన మిగతా వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు సన్నీ లియోన్ హాలీవుడ్లో అరంగేట్రం చేయడానికి సిద్ధమవుతోంది. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ ఇండిపెండెంట్ మూవీలో ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక సైనికురాలి పాత్రలో సన్నీలియోన్ కనిపించనుంది. సినిమా సెట్ నుంచి లీకైన ఫోటోలు ఆన్లైన్లో వైరల్ అయ్యాయి. ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టనున్నట్లు తెలుస్తోంది.