30 May, 2026 | 1:11 AM

పైరవీకారులకు అడ్డాలు?

30-05-2026 12:00 AM

ప్రభుత్వ కార్యాలయాల్లో పెరుగుతున్న అవినీతి 

ప్రతి పనికీ రేటు.. లేదంటే లేటు

కాసులిస్తేనే ఫైళ్ళ కదలిక

విలవిల్లాడుతున్న సామాన్యులు

జగిత్యాల, 27 (విజయక్రాంతి): ప్రభుత్వ కార్యాలయాలు పైరవీకారులకు అడ్డాలుగా మారుతున్నాయని జగిత్యాల జిల్లాలో సామాన్య ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో చెయిచాపడం ఈ నాటిది కాకపోయినా నిరభ్యంతరమైన పనులను చేసేందుకు మాత్రం అప్పటి అధికార యంత్రంగం వెనకడుగు వేసేదికాదు. సామాన్య ప్రజలబాధలు అడిగి తెలుసుకొని పరిష్కారం చూపేవారు.ఇక రాజ కీయ నా యకులు సైతం సామాన్యులకే వెన్ను దన్ను గా నిలిచేవారు.

ప్రభుత్వ కార్యాలయాల్లో పేద, మధ్యతరగతి ప్రజలకు సంబందించిన పనుల పరిష్కారానికి జాప్యం జరుగుతుంటే ప్రజల పక్షాన అప్పటి నాయకులు వాకల్తా పూచ్చుకునేవారు ఏదో ఒకరకంగా సామాన్యులకు న్యాయం చేసేవారు కానీ ఇప్పుడు పరిస్థితి తరుమారుమరయ్యింది అవినీతి అధికారులు, రాజకీయ పైరవికారులు కలిసిపోయి సామాన్య ప్రజల దగ్గర పీల్చి పిప్పి చేసి అధికారులకు ముట్టజేప్పే ఓ తరం ఇప్పుడు రాజకీయాల్లో చెలామణి అవుతుందని సమాచారం. ప్రతి మనిషికి ప్రతిపనికి ఒక రేటు కట్టి దానికి బజాప్తా అప్పగించటమే కొందరు రాజకీయ నాయకులకు పనిగా మారింది అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ నాయకులైతే ఇక కార్యాలయమే సాగిలామౌతుంది.

ఈ నేపథ్యంలో రాజకీయ నేతలు తమ గోడు పట్టించుకోక, అధికారులు స్పందించక సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతు న్నారు. ప్రభుత్వ కార్యాలయాలు పైరవీకారులకు అడ్డాలుగా మారుతున్నాయి పోలీస్ స్టేషన్ లు కూడా ఇందుకు భిన్నంగా లేవు. సక్రమమో అక్రమమోకాని పైరవీకారుల అవతారమెత్తిన రాజకీయ నాయకుల కనుసన్నల్లోనే ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు జరుగుతున్నాయన్నది వాస్తవం. 

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలోను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోను వారిదే హవా

జగిత్యాలలో గత ప్రభుత్వంలోని పైరవీకారుల హావ ఇ ప్పుడు కూడా వారిదే హావ నడుస్తుందనటంలో ఎలాంటి సం దేహం లేదు.ఏదైనా ఒక కారణం చేత పని చేయకుంటే వెంట నే పైస్థాయి నాయకుల నుంచి ఫోన్ చేయించటం ఆనవాయితీగా మారింది.ఈ ఫోన్లకు స్పందించే అధికారులు రెండు రకాలు ఉన్నారు.

ముందుగా అక్రమాన్ని సక్రమం చేసే క్రమంలో ఒక్కసారి ఎమ్మెల్యే లేదా పెద్ద స్థాయి నాయకునితో ఫోన్ చే యించటం ఆ ఫోన్ కాల్ ని ఆసరాగా చేసుకొని పని చేస్తానంటూ పైరవీకారులతో ఒప్పంధాలు కుదుర్చుకునే అధికారుల సంఖ్య ఇప్పుడు పెరిగింది.

ప్రతి పనికి ఒక రేటు మాట్లాడుకోవటం అంతా సజావుగా జరిగిన తరువాత పూచ్చుకోవటం అధికారులకు ఇబ్బంది లేకుండా పోతుంది అవసరానికి తమ దగ్గరికి వచ్చే వారి పనుల వివరాలు తెలుసుకోవటడం పరిపాటిగా మారింది సామాన్య ప్రజలనుండి వసూలు చేసిన సొ మ్ము నీకు కొంత నాకు కొంత అని పంచుకుంటున్నారని స మాచారం.మంత్రి కంటే ఉన్నతాధికారుల కంటే ఈ పైరవీకారులు చెప్పిన పని వెనువెంటనే అవుతుందంటే పరిస్థితి ఏ వి ధంగా ఉందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఆరుబయటే సెటిల్మెంట్ లు

ముఖ్యంగా ఇసుక ట్రాక్టర్లు, భూముల రిజిస్ట్రేషన్ లు, ధ్రు వీకరణ పత్రాలు, పోలీస్ స్టేషన్ లు, పంచాయితీలు ఈ పైరవీకారుల కనుసన్నల్లో జరుగుతున్నాతాయని సమాచారం ఈ పైరవీకారులకు రాజకీయ ముద్ర అన్నింటికి మించి అధికార ముద్ర ఉండటంతో వీరికి ఎదురు లేకుండా పోతుందని ఏ పనైనా ఇట్టే చేస్తామంటూ చిటికెలేస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు.

సామాన్య ప్రజలు పలు కార్యాలయ చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా పలుకుబడి లేని వారికి పనులు కాకపోవటంతో చివరకు ఫైరవికారులనే ఆశ్రస్తున్నారు. ఇటీవల రీజిస్టేషన్ లకు సంబందించి డాక్యుమెంట్ రైటర్ లు,కంప్యూటర్ సెంటర్లే కీలక పాత్ర పోషిస్తున్నాయి భూములైనా ప్లాట్ లైన ఒప్పందమంతా బయటే జరిగిపోతుందని సాయంత్రానికి అధికారులకు చేరి పోతున్నాయని సమాచారం.

ఏసీబీ రైడ్స్ జరిగినా షరామామూలే

జగిత్యాల మున్సిపాలిటీతో పాటు పలు శాఖలలో గత రెండు సంవత్సరాలుగా పలుమార్లు ఏసీబీ రైట్స్ జరిగిన అధికారుల్లో ఎలాంటి మార్పు రాకపోవటం గమనార్హం. గత ప్రభుత్వంలో కొందరు తమ ఇష్టానుసారం వ్యవహరించి తాము ఉన్న పార్టీని ఆ పార్టీ నేతలని బ్రష్టు పట్టించారు. ఇప్పుడు అదే కథ పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధుల పై ఉంది.

జగిత్యాల జిల్లాలో పైరవికారుల జోరు మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లు తుందని ప్రజలు చర్చించుకుంటున్నారు.సంక్షేమం,అభివృద్ధి ప్రభుత్వ కార్యాలయాలకు సంబందించిన పనుల విషయంలో పైరవీకారుల జోరును తగ్గించకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పక పోవచ్చు జిల్లా మంత్రి, ఉన్నాతాధికారులు వీరి పై ద్రుష్టి సారించి పైరవీకారులను కట్టడి చేసి సామాన్య ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాల్లో న్యాయం జరిగేలా చ్యర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.