పీడీఎస్ బియ్యం పట్టివేతపై నామమాత్రపు కేసులు
బోధన్ మే 29 (విజయ క్రాంతి): రుద్రూర్లో రేషన్ బియ్యం దాడుల కలకలం. 9 టన్నులు ఉంటే కేవలం 42 క్వింటాళ్లే చూపించారా? రూ. 30 వేల లంచం ఆరోపణలపై రుద్రూర్ ఎస్హెచ్‌ఓ సాయన్న సంచలన వివరణ నామమాత్రపు కేసులు రుద్రూర్లో రేషన్ బియ్యం దాడుల కలకలం. 9 టన్నులు ఉంటే కేవలం 42 క్వింటాళ్లే చూపించారా? రూ. 30 వేల లంచం ఆరోపణలపై రుద్రూర్ ఎస్హెచ్‌ఓ సాయన్న సంచలన పిడిఎస్ బియ్యం పట్టివేత పై నామమాత్రపు కేసులు బోధన్ డివిజన్ పరిధిలోని రుద్రూర్ మండల కేంద్రం లోని జవహర్ నగర్ కాలనిలో ఇటీవల సిసిఎస్ పోలీసులు జరిపిన దాడుల్లో భారీ స్థాయి పీడీస్ బియ్యాన్ని సుమారు 9 టన్నులు నిల్వ ఉన్నట్లు సీసీ ఎస్ బృందం గుర్తించి నట్లు సమాచారం.
సుమారు 4 ఇళ్లలో బియ్యం నిల్వ ఉన్నప్పటికి ఒకే ఇంట్లో 42 క్వింటాల్లా బియ్యని పట్టుకుని చేతులు దులుపు కోవడం లో అంతర్యామెంటని పలువురు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. సీసీ ఎస్ బృందం పక్క రెక్కి నిర్వహించి బియ్యం నిల్వ లు ఉన్న ఇండ్ల ను గుర్తించి స్థానిక పోలీసులకు అప్పగించారు. దాడులు చేసే సమయం లో బియ్యం నిల్వ ఉన్న ఇంటి యాజమానులు పోలీసుల రాకను చూసి తాళలు వేసి అక్కడి నుండి జారుకున్నారని ఆరోపణలు వెళువెత్తుతున్నాయి. వాస్తవానికి సదరు పోలీసులు తాళాలు ఉన్న ఇంట్లో సోదలు చేయకుండా ఒకే ఇంట్లో ఉన్న బియ్యనిస్వాధీన పరిచ్చుకుని నామమాత్రం గా కేసులు నమోదు చేయడం లో అంతర్యామెంటని పలువురు పేదవి విరుస్తున్నారు.






