13 July, 2026 | 9:40 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

రాష్ట్రంలో ఎండలు షురూ!

16-02-2026 02:10 AM

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

ఖమ్మంలో 34.4 డిగ్రీలు, భద్రాద్రి, సూర్యాపేటలో 34.2 డిగ్రీలు

హైదరాబాద్, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఎండలు షురూ అయ్యాయి. ప్రస్తుతం రాత్రి, ఉదయం వేళల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే మధ్యాహ్నానికి వ చ్చేసరికి ఎండలు మండిపోతున్నాయి. రెం డు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా ల్లో పగటి ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా నమోదవుతున్నాయి. 30 డిగ్రీల కంటే పైనే ఉంటున్నా యి. దీంతో మధ్యాహ్నం ఉక్కపోత ఉంటోం ది. రాబోయే రోజుల్లో ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయి.

ఆదివారం ఉదయం, రాత్రి వేళల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 14 నుంచి 17.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయని తెలంగాణ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక గరిష్ఠ ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఖమ్మంలో 34.4 డిగ్రీలు, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాల్లో 34.2 డిగ్రీ లు నమోదయ్యాయి. నల్లగొండలో 34 డిగ్రీలు, నిర్మల్, వనపర్తి జిల్లాలో 33.9 డిగ్రీ లు, ములుగులో 33.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే రెండు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదుకానున్నట్లు వాతావరణ కేంద్రం సూచించింది. సోమవారం రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు అత్యధి కంగా 34.6 డిగ్రీలు నమోదు కాగా, మంగళవారం 34.5 డిగ్రీలు నమోదుకానుంది.