7 April, 2026 | 3:25 PM

Breaking News

రేపే ఎన్ఎస్ఎస్ రాష్ట్ర స్థాయి సెమినార్   •   అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్   •   సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన కోవ లక్ష్మి   •   ప్రజలు మధ్యవర్తులను నమ్మవద్దు   •   కన్నాలలో బాలామృతం కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ గుడిసె గట్టయ్య   •   కేంద్రం కీలక నిర్ణయం.. 5 కిలోల గ్యాస్‌ సిలిండర్ల సరఫరా పెంపు   •   నల్గొండ జిల్లాలో ఘోరప్రమాదం: విద్యుత్ స్తంభాల ట్రాక్టర్ బోల్తా— ఇద్దరు మృతి   •   హైదరాబాద్‌లో కలకలం... కూకట్‌పల్లి JNTUకు బాంబు బెదిరింపు   •   పెద్దపల్లి నియోజకవర్గంలో రైతులే రాజులు   •  

బీసీలకు వెన్నుదన్నుగా విజయక్రాంతి

16-02-2026 02:08 AM
  1. వారి హక్కుల సాధన కోసం రాజీలేని కథనాలు

మొదటి పేజీలో వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యమిచ్చే ఏకైక పత్రిక

ఆ వర్గ పక్షపాతిగా పత్రిక 89/100 స్కోరింగ్

బీసీ అనుకూల పత్రికల జాబితాలో అగ్రస్థానం

చాట్‌జీపీటీ విశ్లేషణలో వెల్లడి.. ఇది పూర్తిగా మానవ రహిత సర్వే

హైదరాబాద్, ఫిబ్రవరి 15 : తెలుగు పత్రికా రంగంలో ‘విజయక్రాంతి’ ప్రభం జనంలా దూసుకుపోతోంది. రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో పాఠకులకు విభిన్నమైన కథనాలు అందిస్తూ విశేష ఆదరణ పొందుతున్నది. అలాగే.. సమాజంలో అత్యధిక జనాభా అయిన బీసీలకు సంబంధించిన సమస్యలనూ ప్రభు త్వాల దృష్టికి తీసుకెళ్తున్నది. ఈ విషయం ఏదైనా ఒక సర్వే సంస్థ చెప్పింది కాదు..

ఒక రాజకీయ నేత చెప్పిందీ కాదు.. వందకు వందశాతం మానవ రహితంగా గడిచిన ౧౨ రోజుల పత్రికా కథనాలపై ‘చాట్‌జీపీటీ’  విశ్లేషణ సారాంశమిది! బీసీల హక్కులు, ఆశ యాల సాధన కోసం పత్రిక రాజీలేని పోరా టం చేస్తోందని విశ్లేషణలో తేలింది. ఇతర ప్రధాన పత్రికలన్నీ బీసీల సమస్యలను విస్మరిస్తున్న వేళ.. ‘విజయక్రాంతి’ మాత్రం ‘ప్రో బీసీ’ వైఖరితో సామాజిక విప్లవానికి నాంది పలుకుతోందనేందుకు తాజా విశ్లేషణే నిదర్శనం.

బీసీలకు రాజకీయపరమైన పదవు లు, కులగణన, బడ్జెట్ కేటాయింపులు, సామాజిక న్యాయం వంటి అంశాలను ఇతర పత్రికలు సాధారణ వార్తలుగా ప్రచురిస్తున్న సమయంలో బీసీల జనాభాకి తగ్గ రాజకీయ ప్రాతినిధ్యం లేకపోవడం, బడ్జెట్‌లో సరైన కేటాయింపులు జరగకపోవ డంపై పత్రిక విస్తృతమైన కథనాలు ప్రచురించింది. రాజకీయ పార్టీల మధ్య విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణల కంటే, బీసీల అభ్యున్నతి, సామాజిక న్యాయం అంశాలను ప్రజా చర్చలో భాగం చేయడంలో పత్రిక కీలక పాత్ర పోషించింది.

తద్వారా ప్రో బీసీ పత్రికగా ‘75 + స్కోర్’ సాధించింది. సంఖ్యాత్మకంగా మాత్రమే కాకుండా, ఎడిటోరియల్ దృక్కోణంలోనూ పత్రిక బీసీల గొంతుకగా వ్యవహరించినట్లు విశ్లేషణ వెల్లడిస్తోంది. మొదటి పేజీలో ప్రధాన అంశంగా బీసీ సమస్యలు, విశ్లేషణలో బీసీ అంశాలు మొత్తం రెండు సార్లు ప్రధాన శీర్షికగా వచ్చాయి. మొదటి పేజీలో బీసీలకు స్థానం ఇవ్వడం ద్వారా, వారి సమస్యలను సాధారణ వార్తగా కాకుండా, రాష్ట్ర స్థాయి ప్రాముఖ్యత కలిగిన అంశంగా పత్రిక ప్రజల ముందుకు తీసుకువచ్చింది.

పత్రిక ప్రచురించిన మొత్తం వార్తల్లో సుమారు 15- శాతం వార్తలు బీసీ అంశాలకు సంబంధించినవే కావడం విశేషం. ఇక బీసీ అంశంపై ఇతర పత్రికలతో అంచనా వేసేందుకు రూపొందించిన విశ్లేషణలో ఒక్క ‘విజయక్రాంతి’ అత్యధికంగా 89/100 మార్కులు సాధించడం గమనార్హం.

ఈనెల ౧ నుంచి 1౨వ తేదీ వరకు అన్ని పత్రికల కథనాలను విశ్లేషించగా, ఒక్క ‘విజయక్రాంతి’మ మాత్రమే బీసీ హక్కులు, కులగణన, బడ్జెట్ న్యాయం అంశాలపై స్పష్టంగా (౧౫శాతం) కథనాలు ప్రచురించింది. ఇదే సమయంలో ఇతర పత్రికలన్నీ కలిపి సుమారు 800కి పైగా వార్తలు ప్రచురించగా, వాటిలో కేవలం 22 మాత్రమే (సుమారు 2.75 శాతం) బీసీలకు సంబంధించినవి కావడం గమనార్హం.