22 July, 2026 | 4:21 AM

గీతంలో డిజిటల్ పరీక్షలు, హాజరు విధానంపై వర్క్‌షాప్

02-06-2024 12:05 AM

పటాన్‌చెరు, జూన్ 1: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాద్‌లో శనివారం డిజిటల్ హాజరు విధానం, డిజిటల్ పరీక్షల అమలుపై ఒక్కరోజు వర్క్‌షాప్ నిర్వహించా రు. పరీక్షల ప్రక్రియలో పాత పద్ధతులను ఆధునీకరించడం, మనషుల అవసరాన్ని తగ్గించడం, విద్యార్థుల దుష్ప్రవర్తనను అరికట్టడం లక్ష్యంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బెంగళూరు అదనపు ఉపకులపతి, క్యాట్ ఇన్‌చార్జి ప్రొఫెసర్ కేఎన్‌ఎస్ ఆచార్య హాజరయ్యారు. వివిధ ఇంజినీరింగ్ విభాగాల అధిపతులు, హ్యూమానిటీస్, బీ డైరెక్టర్లు, స్కూల్ ఆఫ్ సైన్స్ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ మానవ వనరుల విభాగాల ప్రతినిధు లను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.

గీతం పరీక్ష ప్రక్రియ సంస్కరణలు, సామ ర్థ్యం, పారదర్శకతను పెంపొందించడానికి దృష్టి సారించాలన్నారు. పరీక్ష ప్రక్రియ విధానమంతా పునర్ మూల్యాంకనం చేయడం, బయోమెట్రిక్ ద్వారా ప్రవేశం, క్యూ ఆర్‌కోడ్ ప్రామాణీకరణ వంటి డిజిట ల్ సాంకేతికతలను పరిచయం చేయడం, మానవ ప్రమేయాన్ని తగ్గించడం వంటి వా టి సాధ్యాసా ధ్యాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. డిజిటల్ కెమెరా పర్యవే క్షణలో తరగ తి గదులు, లైవ్ వీడియోల ఫీడ్ ట్రాకింగ్, మొబైల్ ఆధారిత మద్దతు వంటి ప్రతిపాదిత డిజిటల్ సాంకేతికతలను అమలు చేయవలసి ఉంటుందనే అభిప్రాయానికి వచ్చారు.

ఈ సాంకేతికతలను వినియోగించాల్సిన పరీక్షల నిర్వహణ కోసం తరగతి గదుల కేటా యింపులను ఆటోమేట్ చేయడం, ఇన్విజిలేషన్ ప్రక్రియలను ట్రాక్ చేయ డం, జవాబు పత్రాలను సురక్షితంగా నిల్వచేయడం వంటి వి లక్ష్యంగా పెట్టుకున్నారు. అధ్యాపకు లు విధులను ఆధునిక సాంకేతిక సాయంతో పర్యవేక్షించడం, హాజరును సులువుగా తీసుకోవడంతో పాటు పరీక్షల సమయంలో దుర్వినియోగాలను నివారించడానికి డిజిటల్ సాధనాలను ఉపయోగిస్తా రు. ఈ సందర్భంగా సభ్యులు లేవనెత్తిన సందేహాలకు ప్రొఫెసర్ కేఎన్‌ఎస్ ఆచార్య జవాబులిచ్చారు.