13 July, 2026 | 9:39 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

కొత్త వంతెనలు నిర్మించాలని రాస్తారోకో

27-03-2026 12:00 AM

ఉట్నూర్, మార్చి 26 (విజయక్రాంతి): ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలోని రహదారులు, శిథిలావస్థకు చేరిన పాత కల్వర్టులను  వెంటనే తొలగించి కొత్త వంతెన నిర్మించాలని  బంజారా హక్కుల సంరక్షణ కమిటీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్,  బీఆర్‌ఎస్ నాయకుడు భరత్ చౌహాన్ డిమాండ్ చేశారు. గురువారం ఉట్నూర్ మండలం షాంపుర్ గ్రామం వద్ద పాత వంతెనపై బీఆర్‌ఎస్, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.

దీంతో రహదారికి ఇరువైపుల వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. విషయం ఐటిడిఏ పిఓ యువరాజ్ మార్మట్‌కు తెలియగానే భరత్ చౌహాన్‌తో ఫోన్‌లో మాట్లాదారు. విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు ఆర్ అండ్ బి అధికారులతో, ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ఈ సమస్య పరిష్కారానికి మార్గం చూపుతామని హామీ ఇచ్చారు. దీంతో రాస్తారోకో విరమించారు. నిరసనలో ప్రజా సంఘాల నాయకులు  సయ్యద్ రషీద్, కాటం రమేష్, ముకుంద రావు, సుభాష్ ఆడే, మరప బాలాజీ, సీడం విజయ్, ప్రజా సంఘాల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.