13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

డివిజన్ పరిధిలోని సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

27-03-2026 12:00 AM

అధికారులను ఆదేశించిన మేయర్ మూడ్ గణేష్ 

పాల్వంచ మార్చి 26 (విజయక్రాంతి): కొత్తగూడెం నగరపాలక సంస్థ పాల్వంచలోని 42 డివిజన్ పరిధిలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని నగర పాలక సంస్థ మేయర్ మోడ్ గణేష్ అధికారులను ఆదేశించారు. గురువారం 42వ డివిజన్లో విస్తృతంగా ప్రకటించి సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు., ప్రధానంగా పారిశుద్ధ్యం డ్రైనేజీ వ్యవస్థలను గాడిలో పెట్టాలన్నారు.

తాగునీటి సమస్య తలెత్తకుండా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రాథమిక పాఠశాలను సందర్శించి సమస్యలను విద్యార్థుల ద్వారా తెలుసుకున్నారు. శిధిలావస్థలో ఉన్న భవనాన్ని పరిశీలించిన రెండు రోజుల్లో భవనాన్ని తొలగించాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట డిప్యూటీ మేయర్ సిరిపురపు లలిత కుమారి, 42వ డివిజన్ కార్పొరేటర్ డీ మని, ఏడవ డివిజన్ కార్పొరేటర్ సింధుతపస్వి పాల్గొన్నారు.