రాష్ట్ర ప్రభుత్వ నిర్బంధాన్ని నిరసిస్తూ రాస్తారోకో
ఆశాలపై నిర్బంధం, అరెస్టులు ఖండన
ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
సీఐటీయూ జిల్లా నాయకులు మద్దాల ప్రభాకరరావు
ఎర్రుపాలెం, మార్చి 30 (విజయక్రాంతి): ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆశ వర్కర్లు నిర్వహించిన చలో హైదరాబాద్ శాంతి యుత కార్యక్రమాన్ని అడ్డుకోవడం, కార్మిక నాయకులను, ఆశలను నిర్బంధించడాన్ని అరెస్టులు చేయడాన్ని,రాష్ట్ర ప్రభుత్వ నిర్బంధాన్ని సీఐటీయూ జిల్లా నాయకులు మద్దాల ప్రభాకరరావు తీవ్రంగా ఖండించారు.
ఈ నిర్బంధానికి నిరసనగా ఎర్రుపాలెం రింగ్ సెంటర్ వద్ద రాస్తారోకో సీఐటీయూ కో కన్వీనర్ దూదిగం బసవయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ అనేక పోరాటాలు చేశారని ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించకపోవడంతో నిర్లక్ష్యానికి నిరసిస్తూ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఫిక్స్ డ్ వేతనం, ఉద్యోగ భద్రత, గతంలో ఇచ్చిన హామీలు పరిష్కారించలని మార్చి 28న చలో హైదరాబాద్ ఇందిరాపార్క్ శాంతియుత ధర్నా వెళ్తుంటే ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం వాహనాలలో ఎక్కించడం ఆశలపై ప్రభుత్వం దమన కాండ కొనసాగించిందని దుర్మార్గం అమానవీయమన్నారు.
అడుగడుగునా పోలీసుల అడ్డుకున్న అన్ని రకాల నిర్బంధాన్ని చేదించి హైదరాబాద్ ధర్నా చౌక్ చేరుకొని కార్యక్రమం విజయవంతం చేశారని ఇదే వారి ఆవేదనకు నిదర్శనం అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడి ప్రజాపాలన అందిస్తామన్న ప్రభుత్వం, తమ సమస్య పరిష్కరించాలని అడిగినందుకు ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తు ఖూని చేసిందని విమర్శించారు. కార్మికుల పట్ల వారి సమస్యల పట్ల ప్రభుత్వం సరైన విధంగా స్పందించకపోతే భవిష్యత్తులో ఉధృత పోరాటాలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వెంకట రమణ, సంధ్య రాణీ, రమాదేవి,ధనలక్ష్మి, నాగమణి, అంగొతు నాగమణి, వివిధ ఆశా వర్కర్లు పాల్గొన్నారు.




