13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

రెండోవారంలో ఇంటర్ ఫలితాలు

31-03-2026 01:03 AM

ముగిసిన జవాబు పత్రాల మూల్యాంకనం

హైదరాబాద్, మార్చి 30 (విజయక్రాంతి): ఏప్రిల్ రెండో వారంలో ఇంటర్ ఫలితాల విడుదలకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. జవాబుపత్రాల మూల్యాంకన ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో  ఈ నెల 29తో ముగియడంతో ప్రస్తుతం అధికారులు ఫలితాల విడుదలపై దృష్టి సారిం చారు. ఏప్రిల్ 8, 10 లేదా 12 తేదీల్లో ఏదో ఒక రోజున ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది.

ఈ తేదీల ఖరారు కోసం అధికారులు ప్రభుత్వ అనుమతిని కోరినట్లుగా తెలిసింది. వాస్తవానికి ఏప్రిల్ 6న విడుదల చేయాలనుకున్నప్పటికీ, బడ్జెట్ సమావేశాలు, ఇతర త్రా కారణాల వల్ల ఫలితాల విడుదల ప్రక్రి య ఆలస్యమవుతున్నట్లుగా తెలిసింది.  

అకాడమిక్ క్యాలెండర్ విడుదల

ఇంటర్మీడియట్ 2026-27 విద్యాసంవత్సరం అకాడమిక్ క్యాలెండర్‌ను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. జూన్ 1 నుంచి జూనియర్ కాలేజీలు తెరుచుకుంటాయని  తెలిపింది. ప్రాక్టికల్ పరీక్షలు వచ్చే ఏడాది జనవరి చివరి వారంలో కాగా, ఫిబ్రవరి చివరి వారంలో థియరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. వచ్చే ఏడాది మార్చి 27 లాస్ట్ వర్కింగ్ డే.. వేసవి సెలవులు మార్చి 28 నుంచి మే 30 వరకు ఉంటాయని తెలిపింది.

ఇక అడ్వాన్స్‌డ్ పరీక్షలు వచ్చే ఏడాది మే మూడవ వారంలో ఉంటాయని పేర్కొంది. వచ్చే విద్యాసంవత్సరంలో 224 పనిదినాలుంటాయని తెలిపిం ది. దసరా సెలవులు ఈ ఏడాది అక్టోబర్ 22 నుంచి, సంక్రాంతి సెలవులు వచ్చే ఏడాది జనవరి 13 నుంచి ఉంటాయని తెలిపింది.