calender_icon.png 1 July, 2025 | 2:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలి

01-07-2025 12:41:03 AM

మణికొండ జూన్ 30 : మణికొండ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ కస్తూరి నరేందర్ సోమవారం మణికొండ మున్సిపాలిటీ 10వ వార్డు అంజలి గార్డెన్స్ కాలనీలో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాలనీవాసులు అంజలి గార్డెన్స్ లోకి వచ్చే రోడ్డు ఇబ్బందికరంగా ఉందని తెలిపారు. ఆ రోడ్డును పరిశీలించిన కస్తూరి నరేందర్ మున్సిపల్ డీఈ శివ సాయిని పిలిపించి కాలనీవాసుల సమక్షంలో వారి సమస్యలను తెలియజేశారు.

ల్యాంకోహిల్స్ నుండి అంజలి గార్డెన్స్ లోకి వచ్చే రోడ్డు పనులను మరో 2 రోజుల్లో ప్రారంభిస్తామని డిఈ వెల్లడించారు. అంజలి గార్డెన్స్ కాలనీలో ఉన్న వివిధ ఇతర సమస్యలు కమ్యూనిటీ హాల్ బ్యాలెన్స్ వరక్స్, ప్యాచ్ వరక్స్ త్వరగా పూర్తి చేయాలని కస్తూరి నరేందర్ అధికారులను కో రారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జితేందర్, మున్సిపల్ ఎఈ సంజయ్, కార్యనిర్వాక అధ్యక్షులు కిరణ్ కుమార్, మాజీ కౌన్సిలర్ పురుషోత్తం, సీనియర్ నాయకులు మల్లేష్, మాజీ కో ఆప్షన్ సభ్యులు అహ్మద్ షా ఖాన్, అంజలి గార్డెన్స్ అధ్యక్షులు హనుమంత్ కుమార్, కార్యవర్గ సభ్యులు కాశీనాధ శాస్త్రి, అనిత, సతీష్, ఇతర కాలనీవాసులుపాల్గొన్నారు.