01-07-2025 12:41:12 AM
రైల్వే అధికారులకు ఎమ్మెల్యే విజ్ఞప్తి
మహబూబాబాద్, జూన్ 30 (విజయ క్రాంతి): మహబూబాబాద్ నియోజకవర్గంలో పలు రైల్వే స్టేషన్ ల వద్ద మూడో రైల్వే లైన్ నిర్మాణం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అండర్ బ్రిడ్జిలను నిర్మించి పాదాచారులు, తేలికపాటి వాహనాలు రైల్వే ట్రాక్ దాటేందుకు చర్యలు తీసుకోవాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే రైల్వే డిఆర్‌ఎం భారతీష్ కుమార్ జైన్ ను కలిసి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో కాజీపేట -డోర్నకల్ రైల్వే సెక్షన్లో పలు రైల్వే స్టేషన్ల వద్ద అండర్పాస్ నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో వందే భారత్, రప్తి సాగర్, జిటి, హిమాసాగర్, సంఘమిత్ర సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు స్టాపింగ్ ఇవ్వాలని కోరారు. రైల్వే గేట్లు ఉన్నచోట ఆర్యుబీలను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. రంగాపురం వద్ద అసంపూర్తిగా ఉన్న ఆర్ యు బి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు.