calender_icon.png 1 July, 2025 | 10:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుబజార్ కల నెరవేరేనా?

01-07-2025 12:39:29 AM

- రోడ్డుపైనే క్రయ విక్రయాలు

- ఇబ్బంది పడుతున్న ప్రజలు

ఘట్ కేసర్, జూన్ 30 : ఘట్ కేసర్ పట్టణంలో రైతు బజారు ఏర్పాటు చేయకపోవ డంతో రైతులు, చిరువ్యాపారులు తీవ్ర  ఇ బ్బందులు ఎదుర్కొంటున్నారు. గత కాంగ్రె స్ ప్రభుత్వ హాయాంలో రైతుబజార్ ఏర్పాటుకు స్థల సేకరణ జరుపగా నిర్మాణ కార్య రూపం మాత్రం జరుగలేదు. ఇక్కడి రైతులు పండించిన కూరగాయలను ఉప్పల్ మా ర్కెట్ కు తరలించాల్సి వస్తోంది. రైతు బజా రు ఉన్నట్లయితే దళారులకు తావులేకుండా రైతులే నేరుగా వారు పండించిన కూరగాయలను అమ్ముకునే అవకాశం ఉంటుంది.

పట్టణ కేంధ్రంలోని జాతీయ రహదారి ఇరువైపులా అక్కడక్కడ కూరగాయల దుకాణా లు ఉన్నా, చిరువ్యాపారులు మాత్రం కాలనీలలోని రోడ్లపక్కనే సంతలు ఏర్పాటు చేసు కుని వారవారం అమ్ముకుంటున్నారు. ఘట్ కేసర్ అంబేద్కర్ కాలనీ ఎదులాబాద్ రోడ్డు లో ప్రతి శుక్రవారం, బుధవారం ఈడబ్ల్యూఎస్ కాలనీలో, గురువారం ఎన్ ఎఫ్ సి నగర్ లో, పోచారం మున్సిపల్ పరిధిలోని అ న్నోజిగూడ ఎస్‌ఐజీ కాలనీ రోడ్డు, బైపాస్ సర్వీస్ రోడ్డులో కూరగాయల వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి.

చుట్టుపక్కల కాలనీల మహిళలు జాతీయ రహదారి వద్దకు వెళ్లడం కంటే తమ కాలనీ సమీపంలో విక్రయిస్తున్న కూరగాయల మార్కెట్లకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ  ధరలు ఎలా ఉన్నా పెద్ద సంఖ్యలో వచ్చి కూరగాయలను కొనుగోలు చేస్తున్నారు. రోడ్ల పక్కనే పెట్టి అమ్మకాలు జరుపడం వల్ల పూర్తిగా జనాలతో రోడ్లు నిండి ఉండటంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎదులాబాద్ రోడ్డులో భారీ వాహనాలు, బస్సులు, లారీలు, ఇతర వాహనాలు వేగంగా ప్రయాణిస్తుంటాయి.

కూరగాయలు కొనుగోలులో నిమగ్నమైన మహిళలు, వారి పిల్లలకు ఎప్పుడు ఏప్రమాదం ముంచుకొస్తుందో తెలియకుండా ఉన్నది. సాయంత్రం నుండి రాత్రి 10 గంటల వరకు సాగే ఈకూరగాయల వ్యాపారాలకు తగిన సదుపా యాలు కూడా లేకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. కూరగాయల వ్యాపా రుల వద్ద ఆయా మున్సిపాలిటీ వారు కొంత రుసుము వసూలు చేస్తున్నా వారికి ఎలాం టి సౌకర్యం కల్పించకపోవడం అన్యాయం.

అటు రైతులు, కూరగాయల వ్యాపారులు ఇటు ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలంటే కూరగాయలను ఒకే చోట అమ్ముకునే అవకాశం ఉండే రైతుబజార్ ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం వల్లనే రైతుబజార్ నిర్మించడంలో ఆలస్యం జరుగుతుందని, ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, కలెక్టర్ మను చౌదరి, స్థానిక మాజీ ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యే క శ్రద్ధ తీసుకున్నట్లయితే రైతుబజార్ ఏర్పా టు త్వరలో నిర్మించడం కష్టమేమి కాదని పట్టణ, ఉమ్మడి మండల ప్రజలు చెప్పుకుంటున్నారు. 

గత జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి వెజ్, నాన్ వెజ్ బజార్ నిర్మాణాల కోసం ఘట్ కేసర్, పోచారం మున్సిపల్ ప్రాంతాలలో పలు స్థలాలను పరిశీలించిన విషయం తెలిసిందే. అదే కార్యరూపం దాల్చితే మాత్రం ఈప్రాంత రైతులకు, ప్రజలకు ఎంతోమేలు జరుగుతుందన్నదినిజం.