ఏడాదికే ఎన్ని గుంతలో..!
- మంథని ఖానాపూర్ రోడ్డు అధ్వానం
నాసిరకం పనులతో పగుళ్లబారిన తారు రోడ్డు
మంథని, జూన్ 18(విజయక్రాంతి): లక్షలు పెట్టి పోసిన రోడ్డు పట్టుమని పది నెలలు కూడా మన్నికగా లేదు. నాణ్యతలోపంతో అడుగడుగునా గుంతలు.. పగుళ్లతో అధ్వానంగా తయారైంది మంథని ఖానాపూర్ తారు రోడ్డు. లక్షలు వెచ్చించి మంథని రిజిస్టేషన్ కార్యాలయం.. బన్నె చెరువు కట్ట పైనుంచి ఖానాపూర్ వరకు మూడు కిలోమీటర్ల మేర తారు రోడ్డు వేశారు. పనులు సాగిన సమయంలో అధికారులు ర్యవేక్షించకపోవడంతో కాం ట్రాక్టర్ నాసిరకంగా రోడ్డు నిర్మించాడేమో! రహదారి పొడవునా తారు నెర్రెలు బాసింది.
అడుగడుగునా గుంతలు పడ్డా యి. దీంతో ఈ మార్గంగుండా ప్రయాణించడానికి ప్రజలు జం కుతున్నారు. మంథని నుం చి ఖానాపూర్ వరకు దూరం తగ్గుతుందని ఈ రోడ్డు వేశారు. దూరం తగ్గడమేమో గానీ, అధ్వానంగా తయారైన రోడ్డులో మరిన్ని అవస్థలు పడుతున్నట్లు ఖానాపూర్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే రోడ్డు త్వరగా దెబ్బతిన్నదని, సదరు కాంట్రాక్టర్‌పై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు బూడిద గణేష్, ఆర్ల సందీప్, ఏల్పుల సురేష్, గొర్రెంకెల సురేష్ డిమాండ్ చేస్తున్నారు. వీలైనంత త్వరగా దెబ్బతిన్న రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.






