15 July, 2026 | 11:00 PM

బలిదేవత తెలంగాణ తల్లి ఎప్పుడైంది?

07-06-2024 02:47 AM

సమస్యలను సీఎం పక్కదారి పట్టిస్తున్నారు 

కొత్తగా మరో ఉత్సవాల ప్రస్తావన తెచ్చారు

విత్తనాల కోసం రోడ్డెక్కే పరిస్థితి తీసుకువచ్చారు

బీజేపీ ఎంపీ కే లక్ష్మణ్

హైదరాబాద్, జూన్ 6 (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నారని, అప్పటి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని బలిదేవత అంటూ రేవంత్‌రెడ్డి విమర్శించారని, ఇప్పుడు ఆమె తెలం గాణ తల్లి ఎలా అయ్యారంటూ ఓబీసీ మో ర్చా అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. బలిదేవతకు సీఎం భక్తుడు ఎలా అయ్యారో తెలుసుకోవాలని తెలంగాణ ప్రజలంతా కోరుకుంటున్నారని పేర్కొ న్నారు.

ఢిల్లీలో గురువారం మాట్లా డు తూ.. ఎప్పుడు ఏదో అంశంతో ప్రజా సమస్యలను పక్కదారి పట్టించే రేవంత్‌రెడ్డి ఇప్పుడు తెలంగాణ తల్లి ఉత్సవాలు డిసెంబర్ 9న ఏర్పాటు చేస్తున్నామని, ఇందుకు సోనియాగాంధీని ఆహ్వాని స్తున్నామని కాలక్షేపం చేస్తు న్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో రైతులు గోస పడుతున్నారని, రైతుభరోసా, రుణమాఫీ చేయ కుండా అన్నదాతలకు కాంగ్రెస్ సర్కారు అన్యాయం చేస్తోందని విమర్శించారు. విత్తనాల కోసం రైతులు మళ్లీ రోడ్డెక్కే పరిస్థితిని కాంగ్రెస్ సర్కారు తీసుకువచ్చిందన్నారు. 

ఎన్ని కుట్రలు చేసినా 

కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఎన్ని కుట్రలు పన్నినా తెలంగాణ ప్రజలు మోదీ ప్రభుత్వానికి బాసటగా నిలిచారని, రాష్ట్ర ప్రజలకు లక్ష్మణ్ కృతజ్ఞతలు తెలిపారు. గెలిచిన ఎంపీలంతా రాష్ట్రాభివృద్ధి కోసం కష్టపడి పనిచేస్తారని అన్నారు. తెలంగాణలో బీజేపీ బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతోందన్నారు. ఏపీ అసెంబ్లీలో 8 సీట్లు రావడం గర్వంగా ఉందన్నారు. భవిష్యత్తులో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. తమ కంచుకోటలుగా బీఆర్‌ఎస్ భావించిన మెదక్, కరీంనగర్‌లోనూ ఆ పార్టీ చిత్తుగా ఓడిపోయిందని, ఇక ఆ పార్టీ రాష్ట్రంలో తుడుచుపెట్టుకుపోయిందన్నారు.

కాంగ్రెస్‌లోకి చేరిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై చర్యలు లేవని, ఆ రెండు పార్టీలు ఒకటేనని లక్ష్మణ్ ఆరోపించారు. 14 సీట్లు రెఫరెండం అన్న సీఎం రేవంత్‌రెడ్డి కేవలం 8 సీట్లకు పరిమితం అవ్వడం ఆ పార్టీ పతనానికి నాందిగా పేర్కొన్నారు. దీనిపై రేవంత్‌రెడ్డి ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. లిక్కర్ కేసులో అన్ని ఆధారాలతో కవితను అరెస్టు చేస్తే రాజకీయంగా లబ్ధి కోసమేనని రేవంత్‌రెడ్డి ఆరోపణలపై ఆయన మండిపడ్డారు. ఆర్టీసీ ఫ్రీ బస్సుల వల్ల  అనేక మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. వారికి ఉపాధి అవకాశాలు కల్పించకుండా ఈ సర్కారు అన్యాయం చేసిందన్నారు.