15 April, 2026 | 1:14 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

టీఎస్ టి డబ్ల్యూటియు డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ

26-02-2026 02:57 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయ క్రాంతి):  గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల సంఘం (TS-TWTU) జిల్లా శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన  డైరీ , నూతన సంవత్సర 2025 క్యాలెండర్ ను ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ ఉద్యోగులు-ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే TS-TWTU యొక్క ప్రధాన ఎజెండాగా కొనసాగాలని సూచించారు. గిరిజన మారుమూల ప్రాంతాల్లో సేవలందిస్తున్న గిరిజన ఉద్యోగుల సంక్షేమం కోసం TS-TWTU స్థాపనతో అనేక సమస్యలు పరిష్కారమయ్యాయని పేర్కొంటూ, భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లాలని ఆకాంక్షించారు.అనంతరం TS-TWTU పీజీ హెడ్‌మాస్టర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పూర్కా ఉద్దవ్ మాట్లాడుతూ  ఈ విద్యా సంవత్సరంలో పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యలు పరిష్కారమయ్యేలా సంఘం కృషి చేస్తుందని తెలిపారు. ముఖ్యంగా CRT ఉపాధ్యాయుల సమస్యలపై రాజీ లేని పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో TS-TWTU జిల్లా అధ్యక్షులు రాథోడ్ రవీందర్, జిల్లా కోశాధికారి కూడ్మేత అనంత్, రాష్ట్ర నాయకులు కోవ సోనేరావ్, మహిళా కార్యదర్శి కొట్నాక్ శకుంతల, కార్యదర్శులు కూడ్మేత జంగు, లింబారావ్,  శ్యాంరావ్ తదితరులు పాల్గొన్నారు.