25-01-2025 12:27:59 AM
దేవరకొండ ఆర్టీసీ డీఎం రమేశ్ బాబు
దేవరకొండ, జనవరి 24 : ఆర్టీసీ డ్రైవర్లు రోడ్డు భద్రతా నియమాలు తప్పకుండా పాటించాలని దేవరకొండ ఆర్టీసీ డిపో మేనేజర్ తల్లాడ రమేష్బాబు సూచించారు. ఆర్టీసీ డిపో ఆవరణలో శుక్రవారం డ్రైవర్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ మాట్లాడుతూ .. డ్రైవర్ల ఆరోగ్య భద్రతకు ఆర్టీసీ సంస్థ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు.
ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చడంలో ఆర్టీసీ డ్రైవర్ల కృషి ఎనలేనిదన్నారు. సీఐ నరసింహులు మాట్లాడుతూ.. వాహనాలు నడిపేవారు జాగ్రత్తగా వ్యవహరించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రమాదాలకు ఆస్కారం ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం డీఎం, అసిస్టెంట్ మేనేజర్ డ్రైవర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాదరహిత డ్రైవర్లును సన్మానించారు.