calender_icon.png 18 August, 2025 | 3:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

18-08-2025 01:30:08 PM

నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి..

వెల్దుర్తి (విజయక్రాంతి): రాష్ట్రంలో నిన్నటి నుండి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని నర్సాపూర్ శాసనసభ్యురాలు వాకిటి సునీత లక్ష్మారెడ్డి(MLA Vakiti Sunitha Laxma Reddy) వెల్దుర్తి మండల ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. వెల్దుర్తి మండలంలోని ఆయా గ్రామాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి చెరువులు మత్తల్లు దుంకుతున్నాయి ఎవరు కూడా వాగులు దాటే ప్రయత్నం దయచేసి చేయొద్దని సూచించారు. 

మండల కేంద్రంలో, వివిధ గ్రామాల్లో శిధిలావస్థలో ఉన్న ఇళ్లను వెంటనే ఖాళీ చేసి ప్రభుత్వ ఆఫీసుల్లో కానీ స్కూళ్లలో కానీ సంఘ భవనాల్లో కానీ పునరావాసం కల్పించాలని వెల్దుర్తి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, వంచభూపాల్ రెడ్డికి, మాజీ జెడ్పిటిసి సభ్యుడు రమేష్ గౌడ్, మాజీ ఎంపీటీసీ వేన్నవరం మోహన్ రెడ్డి,, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కృష్ణ గౌడ్, మండల ఉపాధ్యక్షుడు సాకారం శ్రీనివాస్ గౌడ్ లకు, మండల కేంద్రంలో ఆయా గ్రామాల్లో, ఏదైనా సమస్య ఉంటే అధికారులను సంప్రదించి వారి సూచనలను సహాయ సహకారాలను తీసుకొని అప్రమత్తంగా ఉండాలని, ఇంకా రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.