16 April, 2026 | 2:23 AM

ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ విద్య

16-04-2026 12:47 AM

ప్రభుత్వ విప్ వేముల వీరేశం

కట్టంగూరు, ఏప్రిల్ 15  : ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా విద్యను అందిస్తున్నాయని ప్రభుత్వ విప్ వేముల వీరేశం తెలిపారు. నకిరేకల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేముల వీరేశం పాల్గొని మాట్లాడారు.

సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్మన్ చెవుగోని రజితశ్రీనివాస్, మండల విద్యాధికారి మేకల నాగయ్య, స్థానిక కౌన్సిలర్లు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.