మల్లాపూర్‌లో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం
మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు చేపట్టిన అరైవ్ అలైవ్ ప్రచార కార్యక్రమాన్ని మల్లాపూర్ ఎస్సై అనిల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులను సమన్వయం చేసుకొని రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై అనిల్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలు అతివేగం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగమని తెలిపారు.
మైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇవ్వరాదని, వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ట్రాఫిక్ నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మేజర్ పంచాయతీ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్, ఆర్‌ఐ, ఉపసర్పంచ్ సోమ రెడ్డి, గ్రామపంచాయతీ కార్యదర్శి గూరుడు శ్రీనివాస్, దేవాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ సంగ రాజం యాదవ్, కోటగిరి ఆనంద్ గౌడ్, సిరిపురం రవీందర్, ముద్దం సత్యనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.




