రాజగోపాల్‌రెడ్డి పేరుతో వెలువడిన ఓ కథనం అవాస్తవం
- కాళేశ్వరం ప్రాజెక్టును కమీషన్ల కోసం కట్టిందని అసెంబ్లీలో ప్రస్తావించిందే నేను
- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మునుగోడు,సెప్టెంబర్ 2 (విజయ క్రాంతి): ఆంధ్రజ్యోతి ప్రతికను తలపించేలా ‘అందజ్యోతి‘ అనే నకిలీ పేపర్ ను క్రియేట్ చేసి ‘కాళేశ్వరం లో అవినీతి లేదు‘ అనే క్యాప్షన్ తో కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి అనని,ప్రస్థావించని మాటలను తమ ఇష్టానుసారంగా రాస్తూ అందజ్యోతి పేపర్ క్లిప్పింగ్ లను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.. కాలేశ్వరం ప్రాజెక్టును కమిషన్ల కోసం కట్టిందని మొట్టమొదట అసెంబ్లీ లో ప్రస్తావించిందే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డినే అని అన్నారు.
మొదటినుండి కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పై అనుమానాలు ఉన్నాయని మీడియా ముందు చెప్పింది,కాలేశ్వరం ప్రాజెక్టు అవినీతిమయంగా మారిందని కేవలం కాంట్రాక్టర్లు, కెసిఆర్ కుటుంబం లబ్ధి కోసమే నిర్మిస్తున్నారని ఎన్నోసార్లు గొంతెత్తి సమాజానికి చాటి చెప్పింది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని అన్నారు.తనపై పదేపదే సోషల్ మీడియా వేదికల ద్వారా తప్పుడు వార్తలు నిరాధార వార్తలు ప్రచారం చేస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారు.. సందర్భం వచ్చినప్పుడు ఇలాంటి ప్రజలే తగిన బుద్ధి చెప్తారని అన్నారు.






