2 July, 2026 | 4:26 PM

Breaking News

ముఖ్యమంత్రి పర్యటనలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి   •   జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి   •   బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్   •   యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •  

రోడ్డు విస్తరణ 60 ఫీట్లకు తగ్గించాలి

25-06-2025 08:43 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో రోడ్ల విస్తరణ పనులను 80 ఫీట్లకు బదులు 60 ఫీట్లకు తగ్గించడం వల్ల అనేకమంది వ్యాపారులకు నష్టం కలగకుండా ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం పట్టణంలో ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న వ్యాపార, వాణిజ్య సముదాయాలకు చెందిన యజమానులు రోడ్డు విస్తరణ పనులను 60 అడుగులకు తగ్గించాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు.

అభివృద్ధికి తాము అడ్డుకాదని పేర్కొంటూనే 80 అడుగుల విస్తీర్ణం వల్ల అనేక వ్యాపార సంస్థలకు చెందిన షాపులు కూల్చివేతకు గురికావడం జరుగుతుందని, దీంతో ఆర్థికంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వాపోయారు. రోడ్డు విస్తరణను 60 అడుగులకు తగ్గిస్తే నష్టం కొంత తగ్గుతుందని, ఆదిశగా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించాలని కోరారు.