24 August, 2026 | 11:21 AM

Breaking News

ఏజెన్సీ నాయకునికి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పదవి

25-06-2025 08:40 PM

టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నియామక పత్రం అందుకున్న నల్లపు దుర్గాప్రసాద్..

భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలం నియోజకవర్గం చర్ల మండలం కుదునూరు గ్రామానికి చెందిన నల్లపు దుర్గాప్రసాద్ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సందర్భంగా  హైదరాబాద్ లో టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు  బొమ్మ మహేష్ కుమార్ గౌడ్(TPCC State President Mahesh Kumar Goud) చేతుల మీదుగా బుధవారం నియామక పత్రం తీసుకున్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ని మర్యాదపూర్వకంగా శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు చింతిరాల రవికుమార్, రాహుల్ గాంధీ సోషల్ మీడియా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇంచార్జ్ సిద్ది గణేష్, యూత్ కాంగ్రెస్ నాయకులు విజయ్ నాయుడు, సుందరి సురేష్ సందీప్ రెడ్డి, రాకేష్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.