calender_icon.png 20 August, 2025 | 9:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు పనులు వేగవంతం చేయాలి

20-08-2025 12:11:52 AM

  1. అధికారులకు ఎమ్మెల్యే ఆదేశం

సుల్తానాబాద్ నుండి కాల్వ శ్రీరాంపూర్ వెళ్ళే రోడ్డు విస్తరణ పనుల వేగవంతంగా పూర్తి చేయాలి

పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు

పెద్దపల్లి ఆగస్టు 19 (విజయక్రాంతి) సుల్తానాబాద్ పట్టణంలోని కాల్వ శ్రీరాంపూర్ వైపు వెళ్ళే రోడ్డు విస్తరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సదర్ కాంట్రాక్టర్ కు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు సూచించారు ఇందుకు అవసరమైన నిధులను సమకూర్చి రోడ్డు విస్తరణలో భాగంగా ప్ర స్తుతం ఉన్న ఆర్‌అండ్ బి గదులను కూల్చివేసి వాటి స్థానంలో కొత్తగా రూ. 65 లక్షల నిధులతో చేపట్టిన గదుల నిర్మాణ పనులను మంగళవారం స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...

ఐబీ చౌరస్తా నుంచి శాంతినగర్ చౌరస్తా వరకు రోడ్డు వెడల్పు నిర్మాణ పనులు వేగవంతం చేస్తున్నారని, ఈ నేపథ్యంలో ఐబి చౌరస్తా నుంచి ఉన్న వాణిజ్య సముదాయ గదులను కూల్చివేసి వాటి వెనుక భాగంలో కొత్తగా గదులను నిర్మిస్తున్నామని, కొత్త గ దుల నిర్మాణం పూర్తయిన తర్వాతనే ముం దున్న దుకాణాలను కూల్చివేయాలని ఆయ న అధికారులను ఆదేశించారు.

నెల రోజుల్లోగా ఈ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. ప నులను వేగవంతం చేయాలని కాంట్రాక్టర్ కు సూచించారు. సుల్తానాబాద్ పట్టణాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా ఐబి చౌరస్తాను విస్తరించి రోడ్డును వెడల్పు చేసేం దుకు జిల్లా కలెక్టర్ చొరవతో ముందుకు వెళుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రం ధాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌ డ్, మార్కెట్ చైర్మన్ మినుపాల ప్రకాష్ రా వు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దాన్నాయక దామోదర్ రావు, గాజుల రాజమల్లు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అబ్బయ్య గౌడ్, మం డల పార్టీ అధ్యక్షులు సతీష్, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, కిశోర్ ,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.