2 July, 2026 | 2:21 PM

Breaking News

గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •   తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •   ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం   •   పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం: కేటీఆర్   •   మణికొండ మాజీ వైస్‌ చైర్మన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు   •   విద్యుత్ షాక్‌తో గేదె మృతి.. రైతుకు రూ.70 వేల నష్టం   •   రోడ్డు ప్రమాదంలో తల్లి కోతి మృతి.. ఒడిని వీడని పసికోతి.. కంటతడి పెట్టించిన ఘటన   •   బ్యాంకులో ఖాతాలపై లాక్‌లు తొలగించాలి   •   కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల డ్రామాలు.. బిగ్ బాస్ షోను తలపిస్తున్నాయ్   •   కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్   •  

ఈడీ విచారణకు రాబర్ట్ వాద్రా డుమ్మా

11-06-2025 12:00 AM

న్యూఢిల్లీ, జూన్ 10: కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక వాద్రా భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు. యూకేకు చెందిన ఆయుధ సలహాదారు సం జయ్ భండారీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ మంగళవారం విచార ణకు రావాలంటూ సమన్లు జారీ చేసింది.. అయితే వ్యక్తిగత కారణాల వల్ల తాను విచారణకు హాజరవ్వలేకపోతున్నట్టు వాద్రా పేర్కొన్నట్టు తెలిసింది.

దీంతో రాబర్డ్ వాద్రాను విచారించేందుకు ఈడీ కొత్త తేదీని ఖరారు చేసే అవకాశముంది. మనీలాండరిం గ్ ఆరోపణలపై ఈడీ దర్యాప్తు కొనసాగుతుండగా, అక్రమాస్తుల కేసులో పరారీలో ఉన్న సంజయ్ భండారీతో వాద్రాకు సం బంధాలు ఉన్నట్టు ఈడీ అనుమానం వ్యక్తం చేస్తోంది.

సంజయ్ 2016లో భారత్ నుంచి పారిపోయాడు. విదేశాల్లో అక్రమ ఆస్తులు, పీఎంఎల్‌ఏ, బ్లాక్ మనీ యాక్ట్ తదితర ఆరోపణలు అతడిపై ఉన్నాయి. యూపీఏ హయాంలో రాబర్ట్ వాద్రాతో సంజయ్ బండారీకి లావాదేవీలు జరిగినట్టు ఆరోపణలున్నాయి. దీంతో ఈ కేసులో ఈడీ వాద్రాపై దృష్టి సారించింది.