10 May, 2026 | 1:10 AM

రోబోటిక్ సర్జరీలే భవిష్యత్తు!

10-05-2026 12:29 AM

హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్థోపెడిక్ సదస్సు

మెడికవర్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ ఆధ్వర్యంలో ఈ నెల 9, 10 తేదీల్లో రోబోటిక్ అసి స్టెడ్ హిప్ రీప్లేస్మెంట్‌పై రెండు రోజుల జాతీ య సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం లో దేశవ్యాప్తంగా 500కు పైగా ఆర్థోపెడిక్ సర్జన్లు పాల్గొననున్నారు. తెలంగాణ ఆర్థోపెడిక్ అసోసియేషన్, ట్విన్ సిటీస్ ఆర్థోపెడిక్ సొసైటీ, తెలంగాణ ఆర్థ్రోప్లాస్టీ అసోసియేషన్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ సదస్సు హైదరాబాద్లోని ట్రైడెంట్ హోటల్లో జరుగుతుంది.

ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం యువ ఆర్థోపెడిక్ వైద్యులకు రోబోటిక్, కంప్యూటర్ అసిస్టెడ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలపై అవగాహన కల్పించడం, ఆధునిక సాంకేతికతలను నేర్పించడం, భవిష్యత్తులో వీటిని వైద్య సేవల్లో విస్తృతంగా వినియోగించేందుకు ప్రోత్సహించడం. అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్, అవుట్‌పేషెంట్ హిప్, మోకాలి మార్పిడి శస్త్రచికిత్సల నిపుణు డు డాక్టర్ ఆండ్రూ బి. విక్లైన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ విక్లైన్ మాట్లాడుతూ.. ‘భారతీయ రోగుల్లో హిప్ రీప్లేస్మెంట్ సర్జరీలు పాశ్చాత్య దేశాలతో పోలిస్తే మరింత క్లిష్టంగా ఉంటాయి. చాలా మంది రోగులు చివరి దశలో మాత్రమే వైద్యులను సంప్రదిస్తారు.

అప్పటికే ఎముకల బలం తగ్గిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో రోబోటిక్ సర్జ రీ ద్వారా ఇంప్లాంట్‌ను అత్యంత ఖచ్చితత్వం తో అమర్చడం వల్ల మంచి ఫలితాలు సాధించగలుగుతున్నాం అన్నారు. న్యూయార్క్‌లోని తమ కేంద్రంలో ప్రతి నెల 150కు పైగా హిప్ రీప్లేస్మెంట్ సర్జరీలు చేస్తుంటాం. అమెరికాలో రోబోటిక్ హిప్ రీప్లేస్మెంట్ చేయించుకున్న రోగులను సాధారణంగా శస్త్రచికిత్స అనంతరం కేవలం ఆరు గంటల్లోనే డిశ్చార్జ్ చేస్తారు. సరైన ప్రోటోకాల్స్, రోబోటిక్ టెక్నాలజీ ఖచ్చితత్వం వల్ల ‘సేమ్ డే డిశ్చార్జ్’ ఇప్పుడు సాధారణ ప్రక్రియగా మారింది అని తెలిపారు.

రెండు దశాబ్దాలుగా హిప్ రీప్లేస్మెంట్ సర్జరీలు.. 

మెడికవర్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ ఆర్థోపెడిక్స్ విభాగాధిపతి, చీఫ్ రోబోటిక్ జాయిం ట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ ఉదయ్ కృష్ణ మైనే ని మాట్లాడుతూ.. గత రెండు దశాబ్దాలుగా క్లిష్టమైన హిప్ రీప్లేస్మెంట్ సర్జరీలు నిర్వహిస్తున్నాం. రోబోటిక్ టెక్నాలజీతో ఇప్పుడు ఇంప్లాంట్లను మరింత ఖచ్చితత్వంతో అమర్చగలుగుతున్నాం. దీని వల్ల ఇంప్లాంట్ దీర్ఘకా లం నిలకడగా ఉండటంతో పాటు రివిజన్ సర్జరీ అవసరం తగ్గే అవకాశం ఉంది అన్నారు.

అమెరికా వంటి దేశాల్లో ప్రజలు సాధారణం గా పొడవుగా ఉండటంతోపాటు విటమిన్ లోపాలు తక్కువగా ఉంటాయి. కానీ దేశంలో చాలామంది విటమిన్ డీ, కాల్షియం లోపాలతో బాధపడుతుంటారు. దీనివల్ల ఎముకల సాంద్రత తగ్గిపోతుంది. వైద్యులు సర్జరీ అవసరమని చెప్పినా రోగులు వెంటనే ముందుకు రావడం లేదు. చాలా మంది రెండు నుంచి మూడేళ్ల తర్వాత తిరిగొస్తున్నారు. అప్పటికి జాయింట్ పూర్తిగా దెబ్బతిని సర్జరీ మరింత క్లిష్టమవుతోంది.

దీంతో రోబోటిక్ సర్జరీ మంచిదని తెలిపారు. ఇండియన్ ఆర్థ్రోప్లాస్టీ అసోసియేషన్ (ఐఏఏ) వైస్ ప్రెసిడెంట్, సీనియర్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ రాజ్‌కుమార్‌నటేశన్ మాట్లాడు తూ.. రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ టెక్నాలజీ ఆర్థోపె డిక్ శస్త్రచికిత్సల్లో కొత్త ప్రమాణాలను సృష్టిస్తోంది అని చెప్పారు. అమెరికా లో హిప్ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్సకు రూ.25 లక్షలకుపైగా ఖర్చవుతుందని, అదే మెడికవర్‌లో ౩ రెట్లు తక్కువ ఖర్చు అవుతుందని ఆస్పత్రి యాజమాన్యం తెలిపింది.