05-07-2025 02:14:46 PM
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి, (విజయక్రాంతి): ఎన్నికల ప్రక్రియలో బూత్ స్థాయి అధికారుల(బీఎల్వో) పాత్ర ఎంతో కీలకమని, బిఎల్ఓలందరూ ఫామ్ 6, 7, 8 లపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి(District Collector Adarsh Surabhi) అన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బిఎల్ఓలకు జులై 3వ తేదీ నుండి జులై 10వ తేదీ వరకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో బిఎల్ఓ లకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో బూత్ స్థాయి అధికారుల(బీఎల్)వో పాత్ర ఎంతో కీలకమని, బిఎల్ఓలందరూ ఫామ్ 6, 7, 8 లపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని అన్నారు.
ప్రతి ఒక్క బిఎల్ఓ తమ వద్ద ఎలకక్టరల్ రోల్ కలిగి ఉండాలని సూచించారు. ప్రతి బిఎల్వో తమ పరిధిలోని కోట్లలో డూప్లికేట్ ఓట్లు ఏమైనా ఉంటే తొలగించాలని, అదేవిధంగా కొత్త ఓటర్లను ఫామ్ 6 ద్వారా ఎన్రోల్ చేయాలని సూచించారు. ఎవరైనా వ్యక్తులు చనిపోతే వారి ఓట్లను కూడా గుర్తించి తొలగించాలని సూచించారు. ఎవరైనా ఫామ్ 6 ద్వారా కొత్తగా ఓటు హక్కు కోసం నమోదు చేసుకుంటే, వారికి గతంలో ఎక్కడైనా ఓటు ఉంటే ఫాం 6 అనుమతించవద్దని చెప్పారు. ఓటర్ అప్లికేషన్లను స్వతహాగా ఆన్లైన్ చేసే ప్రక్రియను బిఎల్వోలు నేర్చుకోవాలన్నారు. ఈ అంశాలకు సంబంధించి ఏమైనా అనుమానాలు ఉంటే ఇక్కడే శిక్షణ కార్యక్రమంలో నివృత్తి చేసుకోవాలని కలెక్టర్ బిఎల్ఓ లకు వివరించారు. ఆర్డీవో సుబ్రహ్మణ్యం, తహసిల్దార్ రమేష్ రెడ్డి, శిక్షణ అధికారులు, ఇతర ఎన్నికల అధికారులు, తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.