calender_icon.png 5 July, 2025 | 10:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థుల సంఖ్యకనుగుణంగా ఉపాధ్యాయ పోస్టులను సర్దుబాటు చేయాలి

05-07-2025 06:16:58 PM

సిద్దిపేట (విజయక్రాంతి): తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్(Telangana Progressive Teachers Federation) సిద్దిపేట జిల్లా శాఖ శనివారం సిద్దిపేట ఉపాధ్యాయ భవన్లో జిల్లా అధ్యక్షులు సిహెచ్. విజయేందర్ రెడ్డి అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా టిపిటిఎఫ్ రాష్ట్ర అసోసియే ట్ అధ్యక్షులు జి. తిరుపతిరెడ్డి మాట్లాడుతూ... సిద్దిపేట జిల్లాలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులను విద్యార్థుల సంఖ్యకనుగునంగా సర్దుబాటు చేయాలని, విద్యార్థులు అధికంగా ఉన్న పాఠశాలల్లో సరిపోను పద్యాలు లేనందున తీవ్రంగా నష్టపోతున్నాయనీ, బడిబాటలో విద్యార్థులు అధిక సంఖ్యలో చేరిన పాఠశాలలను విద్యాశాఖ గుర్తించాలన్నారు.

విద్యా శాఖలో పర్యవేక్షణ అధికారాలు ఎంఈఓ లకు మాత్రమే ఉండాలని, ఉపాధ్యాయుల ద్వారా పర్యవేక్షణ చేయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన కార్మికులకు నాలుగు నెలల నుండి వేతనాలు, బిల్లులు అందడం లేదని వెంటనే బిల్లులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. నాలుగు నెలల నుండి స్కావెంజర్ల వేతనాలు రావడం లేదని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కొత్తగా ప్రాథమిక పాఠశాలలో యూకేజీ నుండి ప్రారంభమైన వాటికి పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఒక తరగతి గది నిర్మించాలని, తరగతికి ఒక ఉపాధ్యాయుని కేటాయించాలని, ప్రాథమిక పాఠశాలకు ప్రధానోపాధ్యాయులు తెలుగు హిందీ, వ్యాయామ ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర కార్యదర్శి రాజయ్య  మాట్లాడుతూ 2023 నుండి రావాల్సిన పి ఆర్ సి ని వెంటనే ప్రకటించాలని ,పెండింగ్లో ఉన్న ఐదు డిఏలను విడుదల చేయాలని, మెడికల్ బిల్లులు, జిపిఎఫ్ డబ్బులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. నరేందర్, జిల్లా కమిటీ సభ్యులు సత్యనారాయణ, రామ్ రెడ్డి, పాపిరెడ్డి, నరసింహారెడ్డి, శివాజీ మల్లేశం, సత్య కృష్ణ, శ్రీనివాస్, రాములు, అజీజ్, రాష్ట్ర కౌన్సిలర్ లు రాజులు, జమీర్  మోహియోద్దీన్, రామస్వామి, మండల నాయకులు కృష్ణ , శ్రీనివాస్, రామచంద్రం ,హరికృష్ణ, సుధాకర్ రెడ్డి, శ్రీధర్, బాల రాజు ,కనకయ్య, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.