calender_icon.png 5 July, 2025 | 11:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైదంబండలో గాయపడ్డ బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి

05-07-2025 06:47:25 PM

కరీంనగర్ లో వైద్యులకు సూచించిన మంత్రి..

రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు..

ముత్తారం (విజయక్రాంతి): ముత్తారం మండలంలో శుక్రవారం రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) పేర్కొన్నారు. గాయపడి కరీంనగర్ మెడికేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు త్వరగా కోలుకునేలా వైద్యం అందించాలని సంబంధిత డాక్టర్లను ఫోన్ లో కోరారు. బాధితులకు మెరుగైన వైద్యం కోసం చర్యలు తీసుకుంటామని మంత్రికి వైద్యులు తెలిపారు.

కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి అక్కడి వైద్య పరిస్థితిలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు, మాజీ జెడ్పిటిసి చొప్పరి సదానందమును ఆదేశించారు. మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మాజీ జెడ్పిటిసి సదానందం పరామర్శించారు. మెరుగైన వైద్యం కోసం సంబంధిత డాక్టర్లతో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడాడనీ బాధితులకు భరోసా కల్పించారు.