calender_icon.png 5 July, 2025 | 11:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జెట్ స్కీ స్కూటర్ తరలింపును అడ్డుకున్న బీఆర్ఎస్ నాయకులు

05-07-2025 06:29:55 PM

కరీంనగర్ (విజయక్రాంతి): కరీంనగర్ లో గల లోయర్ మానేరు నదిలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి రాష్ట్ర మంత్రి ప్రస్తుత శాసనసభ్యులు గంగుల కమలాకర్(MLA Gangula Kamalakar) నేతృత్వంలో నగరపాలక సంస్థకు కేటాయించిన సీఎం అస్సూర్యెన్స్ నిధుల ద్వారా కొనుగోలు చేసిన జెట్ స్కీ స్కూటర్ ను శనివారం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ కు తరలిస్తున్న విషయాన్ని తెలుసుకొని.. బీఆర్ఎస్ పార్టీ నగర శాఖ అధ్యక్షులు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో.. లేక్ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. కరీంనగర్ నగర ప్రజల డబ్బులతో కొనుగోలు చేసిన స్కూటర్ ను వెంటనే తిరిగి తీసుకురావాలంటూ నినాదాలు చేశారు.

ధర్నా విషయం తెలుసుకున్న పర్యాటకశాఖ అధికారులు తిరిగి జెట్ స్కీ స్కూటర్ను  మానేరు నదిలో యధాస్థానానికి చేర్చారు. ఈ కార్యక్రమంలో నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్ల హరిశంకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు దిండిగాల మహేష్, ఏవి రమణ, మాజీ వైస్ ఎంపీపీ తిరుపతి నాయక్, మైనార్టీ శాఖ అధ్యక్షులు మీర్ షాకత్ ఆలీ, ప్రధాన కార్యదర్శి వాజిద్ హుస్సేన్, పార్టీ డివిజన్ అధ్యక్షులు  చేతి చంద్రశేఖర్, ఆరే రవి, జల్లోజి శ్రీనివాస్, నారదాసు వసంతరావు, నదీమ్, ఒడ్నాల  రాజు, పటేల్ సుధీర్ రెడ్డి, కొత్త అనిల్ కుమార్, బి ఆర్ ఎస్ వి నాయకులు చుక్క శ్రీనివాస్, నరేష్ రెడ్డి, నాయకులు ధీరజ్, ఉమాశంకర్, తదితరులు పాల్గొన్నారు.