05-07-2025 06:39:59 PM
రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల..
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): సమాజంలో పర్యావరణ పరిరక్షణకై మొక్కలు నాటడం సామాజిక బాధ్యత అని ప్రతి ఒక్కరు తమ ఇంటి పరిసరాల్లో మొక్కలు నాటాలని రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ డిసిఎంఎస్ మాజీ చైర్మన్, పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు(Kotwala Srinivasa Rao) అన్నారు. అంతర్జాతీయ సహకార దినోత్సవం సందర్భంగా పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. శనివారం పాల్వంచ మండలం పరిధిలోని సోములగూడెం సొసైటీ ధాన్యంకొలుగోలు కేంద్రం వద్ద కొత్వాలతో పాటు సొసైటీ వైస్ చైర్మన్ కాంపెల్లి కనకేష్, పాలకవర్గ సభ్యులు, మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... మొక్కలు పెంచడం వలన పర్యావరణ సమతుల్యం ఏర్పడడంతో పాటు, కాలుష్య నివారణ జరుగుతుందన్నారు. సకాలంలో వర్షాలు కురుస్తాయని కొత్వాల అన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ కాంపెల్లి కనకేష్, పాలకవర్గ సభ్యులు చౌగాని పాపారావు, మైనే ని వెంకటేశ్వరరావు, భూక్య కిషన్, సీఈవో జి లక్ష్మీనారాయణ, సోముల గూడెం పంచాయతీ కార్యదర్శి కందకట్ల శ్యామ్, మాజీ ఎంపీటీసీ భూక్య శంకర్, గ్రామస్తులు కళారావు, కలకొండ నరసింహారావు, జగదీశ్వర్ రావు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.