calender_icon.png 5 July, 2025 | 11:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి

05-07-2025 06:32:40 PM

నిర్మల్ (విజయక్రాంతి): కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 9న నిర్వహించే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె(General Strike)ను జయప్రదం చేయాలని ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి రాజన్న పిలుపునిచ్చారు. శనివారం జిల్లాలోని వివిధ కార్మికులతో సమావేశం నిర్వహించి సమ్మె పోస్టర్లను విడుదల తీశారు. కార్మికులకు పని భద్రత కూలీరేట్ల పెంపు లేబర్ కోడ్ చట్టాలు రద్దు చేయడం వంటి డిమాండ్లతో ఈ సమ్మె నిర్వహిస్తున్నందున కార్మికులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు భూమేష్ భూషణ్ గంగన్న తదితరులు పాల్గొన్నారు.