24 July, 2026 | 3:29 PM

ఢిల్లీ విమానాశ్రయంలో ప్రమాదం.. టెర్మినల్-1లో కూలిన పైకప్పు

28-06-2024 09:27 AM

న్యూఢిల్లీ :  ఢిల్లీలో వర్షం బీభత్సం సృష్టించింది. లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. రహదారులపై భారీగా వర్షపు నీరు చేరడంతో పలుచోట్ల వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర్షపు నీటిలో కార్లు, ట్రాక్ లు చిక్కుకుపోయాయి. వర్షాలకు ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్-1లో శుక్రవారం ఉదయం 5 గంటల సమయంలో పైకప్పు కూలి మూడు కార్లపై పడింది.

ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో నలుగురు తీవ్రంగాయపడ్డారు. పలు వాహనాలు సైతం ధ్వంసమయ్యాయి. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న సిబ్బంది సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు.  టెర్మినెట్-1 నుంచి విమాన సర్వీసులు అన్ని రద్దు చేశామని, ముందుజాగ్రత్తగాచెక్ ఇన్ కౌంటర్లు మూసివేశామని విమానాశ్రయ వర్గాలు  పేర్కొన్నాయి.