ఢిల్లీ ఎయిర్ పోర్టు ఘటనపై స్పందించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
న్యూఢిల్లీ : ఢిల్లీలో వరుసగా రెండోరోజు వర్ష బీభత్సం సృష్టించింది. ఈ వర్షాలకు శుక్రవారం తెల్లవారు జామున 5.00 గంటల సమాయంలో ఢిల్లీ విమానాశ్రయంలో టెర్మినల్-1 పైకప్పు కూలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెంగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాగా ఘటపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. ఘటనాస్థలిలో సహాయచర్యలు కొనసాగుతున్నాయని, క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు.
టెర్మినల్-1 నుంచి బయల్దేరే అన్ని విమాన సర్వీసులను రద్దు చేసినట్లు ఢిల్లీ ఎయిర్ పోర్టు అధికారులు వెల్లడించారు. ముందుజాగ్రత్తగా చెక్ ఇన్ కౌంటర్లు మూసివేశామని, ప్రయాణికులకు ఏర్పడిన అసౌకర్యానికి చింతిస్తూ క్షమాపణలు కోరారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల వరకు ఇండిగో, స్పైన్ జెట్ విమాన సర్వీసులను నిలిపివేసినట్లు ఆ సంస్థలు పేర్కొన్నాయి.






