08-11-2025 09:11:02 PM
సీఐ హనూక్..
బెల్లంపల్లి (విజయక్రాంతి): రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మెదలాలని బెల్లంపల్లి రూరల్ సీఐ హనూక్ సూచించారు. శనివారం సర్కిల్ పరిధిలో పలు నేరాల్లో నిందితులుగా ఉన్న రౌడీ షీటర్లకు ఆయన కౌన్సిలింగ్ నిర్వహించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. ఎక్కడైనా నేరాలు జరిగే సమాచారం అందితే పోలీసులకు తెలపాలని సూచించారు. రౌడీషీటర్లుగా రికార్డులో ఉన్న వారు నేర సంఘటనల్లో పాల్గొంటే వారిపై మరింత కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. కౌన్సిలింగ్ లో తాళ్ల గురిజాల ఎస్సై రామకృష్ణ పాల్గొన్నారు.