calender_icon.png 8 November, 2025 | 11:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

08-11-2025 09:15:47 PM

తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి  రేవంతన్న

ఆసుపత్రి లో పేషెంట్స్ కు పండ్లు, బ్రేడ్స్ ప్యాకెట్స్ పంపిణి 

 రక్తదానం చేసిన కాంగ్రెస్ నాయకులు

ఏటూరునాగారం,(విజయక్రాంతి): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు మండల కేంద్రంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఏటూర్ నాగారం ,టౌన్ అధ్యక్షుడు ఎండీ సులేమాన్  ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి. ఎ.రేవంత్ రెడ్డి  జన్మదిన సందర్భంగా కేక్ కటింగ్ చేసి బాణసంచాలు పేల్చి సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల అధ్యక్షుడు చిటమట రఘు, జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఎండి అయూబ్ ఖాన్, జిల్లా ఉపాధ్యక్షుడు ఎండీ ఖలీల్ ఖాన్,మాజీ జడ్పీటీసీ నామ కరణ్ చంద్ గాంధీ, పి ఎ సి ఎస్  వైస్ చైర్మన్ చెన్నూరి బాలరాజు పాల్గొన్నారు.

 ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు చిటమట రఘు టౌన్ అధ్యక్షుడు ఎండి సులేమాన్  మాట్లాడుతూ.టిపిసిసి గా ఉన్న రేవంత్ రెడ్డి ని మాజీ సీఎం కెసిఆర్ గత అనేక ఇబ్బందులకు గురిచేస్తూ అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు గురి చేశారు. గత పడేండ్ల దొరల పాలన అవినీతి అక్రమాలను అంతముందించి ముఖ్యమంత్రిగా ఎదిగిన రేవంత్ రెడ్డి ని అభినందించారు.రేవంత్ రెడ్డి  ప్రవేశ పెడుతున్న సంక్షేమాలు ఫ్రీ బస్సు,ఆరోగ్య శ్రీ,ఉచిత కరెంటు,500 గ్యాస్ సిలిండర్, రెండు లక్షలు రుణమాఫీ, వరి క్వింటాకు 500 బోనస్, ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం, కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ఎస్సీ వర్గీకరణ, మహిళ సంఘాలకు పెట్రోల్ బంకులు,

మహిళలకు ఆర్ టి సి.బస్సులు, ఇందిరా మహిళా కాంటీన్లు, సోలార్ విద్యుత్ యూనిట్లు, హైడ్రా, చెరువులు సుందరికరణ, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్,30సూపర్ స్పెషలిటీ హాస్పిటల్స్, 2 లక్షల కోట్లు విదేశీ పెట్టుబడులు, 82 వేల ఉద్యోగ ఉపాధి కల్పన, ఫ్యూచర్ సిటీ,సాగు నీరు, త్రాగు నీరు, గ్రామ గ్రామాన సిసి రోడ్లు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో అనేక రంగాల్లో అభివృద్ధి చెందుతుందని తెలంగాణ అని కొనియాడారు. ఇది కదా కాంగ్రెస్ ప్రజ పాలన సంక్షేమం అంటే జైయహో కాంగ్రెస్ పార్టీ జయహో రేవంతన్న అంటూ నినాదాలు తెలుపుతూ సంబరాలు జరుపుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద అభిమానంతో కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు నగవత్ కిరణ్ ఆధ్వర్యంలో ముమ్మానేని రమేష్, నగవత్ కిరణ్,నాగేష్  బ్లడ్ బ్యాంకు కు బ్లడ్ డొనేషన్ చేశారు.