30 March, 2026 | 11:08 PM

ఐఏఎఫ్‌లో ‘అగ్నివీర్‌వాయి’లకు దరఖాస్తులు

16-05-2024 01:33 AM

హైదరాబాద్, మే 15 (విజయక్రాంతి): ‘అగ్నిపథ్’ కింద అగ్నివీర్ వాయుల నియామకానికి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. అవివాహితులైన మహిళలు, పురుషులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. నోటిఫికేషన్ పూర్తి వివరాలు https://agnipathvayu.cdac.inలో అందుబాటు లో ఉంటాయని చెప్పింది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఈ నెల 22న ఉదయం 11 గంటలకు ప్రారంభమై, జూన్ 5న రాత్రి 11 గంటలకు ముగుస్తుందని వెల్లడించింది. దరఖాస్తు చేసే అభ్యర్థులు జనవరి 2, 2004 నుంచి జూలై 2, 2004 మధ్య జన్మించి ఉండాలని పేర్కొంది.